Kangana Ranaut: నేను వాళ్లలా హీరోల రూమ్‌కు వెళ్లే టైప్ కాదు.. కంగనా కొత్త కాంట్రవర్సీ..!
పెళ్లిళ్లలో ఐటమ్ డ్యాన్స్‌లు చేయడానికి అంగీకరించనని.. రాత్రిపూట తనను కోరుకున్న ఏ హీరో రూమ్‌కి వెళ్లడానికి ఇష్టపడనని.. అందుకే పిచ్చిదానిగా ముద్ర వేసి తనను జైల్లో పెట్టే ప్రయత్నం చేశారని.. బాలీవుడ్ హీరోలపై ఇన్‌డైరెక్ట్ కౌంటర్లు వేసింది కంగనా.
కాంట్రవర్సీకి కేరాఫ్‌లా ఉంటుంది కంగనా రనౌత్. మనసుకు ఏది నచ్చితే అది మాట్లాడేయడం.. వివాదాలకు కేంద్రం కావడం.. రింగుల జుట్టు అమ్మడుకు కొత్తేం కాదు. సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక విషయం మీద తన ఒపీనియన్ చెప్తూ ఉంటుంది. అవకాశం క్రియేట్ చేసుకొని మరీ బాలీవుడ్‌ను ఏకిపారేసిన ఘటనలు ఎన్నో ! ఫైర్ బ్రాండ్ అనే పేరు దాటి.. మిస్సైల్ బ్రాండ్ అనేలా కంగనా తీరు కనిపిస్తోంది. వరుస వివాదాలతో.. కంగనా ట్విట్టర్ అకౌంట్ కొద్దిరోజులు సస్పెండ్ చేశారు కూడా !
దీంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కంగనా.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయింది. బాలీవుడ్ మీద విరుచుకుపడుతోంది. కంగనా పొలంలో పనిచేస్తున్న తన తల్లి ఫోటోని షేర్ చేసి… ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. అమ్మడు ఇచ్చిన సమాధానమే ఇప్పుడు కాంట్రవర్సీ అవుతోంది. కంగనా మిలీనియర్ అయినా ఆమె తల్లి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు.. చాలా గ్రేట్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఐతే తన సంపాదన వల్ల తన తల్లి ధనవంతురాలు కాదని.. 25ఏళ్లకు పైగా తన తల్లి టీచర్‌గా పనిచేసిందని కంగనా వివరణ ఇచ్చింది. పనిలో పనిగా బాలీవుడ్ మీద విరుచుకుపడింది.
కొందరిలాగా తాను పెళ్లిల్లో చవకబారు వస్తువులు ధరించనని.. ఇతర అమ్మాయిల్లా తాను కబుర్లు చెప్పనని.. చాలామంది అందుకే తనను అహంకారి అంటారని.. పెళ్లిళ్లలో ఐటమ్ డ్యాన్స్‌లు చేయడానికి అంగీకరించనని.. రాత్రిపూట తనను కోరుకున్న ఏ హీరో రూమ్‌కి వెళ్లడానికి ఇష్టపడనని.. అందుకే పిచ్చిదానిగా ముద్ర వేసి తనను జైల్లో పెట్టే ప్రయత్నం చేశారని.. బాలీవుడ్ హీరోలపై ఇన్‌డైరెక్ట్ కౌంటర్లు వేసింది కంగనా. ఇంతకీ కంగనాను రూమ్‌కు పిలిచిన హీరో ఎవరు.. ఇప్పుడీ మాటలను కర్లీ హెయిర్ బ్యూటీ ఎందుకు హైలైట్ చేస్తోంది.. కంగనా మాటలు ఇక్కడితో ఆగుతాయా.. కొత్త రచ్చ స్టార్ట్ అవుతుందా అనే చర్చ మొదలైంది..