Kangana Ranaut: కంగనా కెరీర్ క్లైమాక్స్‌కు చేరిందా..? సినిమాల బిజినెస్ ఆగిపోయిందా..?

కంగనా నటించిన క్వీన్ అప్పట్లో ఒక సంచలనం. తర్వాత ‘మణికర్ణిక’తో కూడా సత్తా చాటింది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యే సరికి తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ బాలీవుడ్‌లో అనేక మందిని టార్గెట్ చేసింది. రాజకీయాల్లో వేలు పెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 06:04 PMLast Updated on: Oct 23, 2023 | 6:04 PM

Kangana Ranauts Career Reaches Climax As Her Movies Becoming Flop

Kangana Ranaut: ఎంత పెద్ద హీరోయిన్‌ అయినా హిట్టు కొడితేనే మార్కెట్‌లో డిమాండ్‌. వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే జోరు తగ్గుతుంది. తర్వాత చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే మార్కెట్ డౌన్ అవుతుంది. దాని ఎఫెక్ట్ అప్ కమింగ్ మూవీస్‌పై పడుతుంది. ప్రజెంట్ ఇలాంటి ఫేజ్‌లోనే ఇరుక్కుపోయింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో వందల కోట్లు వసూళ్లు చేసిన బ్యూటీ. కంగనా నటించిన క్వీన్ అప్పట్లో ఒక సంచలనం.

తర్వాత ‘మణికర్ణిక’తో కూడా సత్తా చాటింది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యే సరికి తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ బాలీవుడ్‌లో అనేక మందిని టార్గెట్ చేసింది. రాజకీయాల్లో వేలు పెట్టింది. ఇవే జనాలకు కంగనా అంటే చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. ఆ ఎఫెక్ట్ తన సినిమాలపై పడింది. ‘మణికర్ణిక’ తర్వాత కంగనా ‘జడ్జిమెంటల్ హై క్యా’, పంగా, ధాకడ్ వంటి సినిమాలు చేస్తే ఒక్క సినిమా కూడా మినిమం ఇంపాక్ట్ చూపలేకపోయింది. దాకడ్ అయితే రూ.5 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక సౌత్‌లో ఈ బ్యూటీ నటించిన తలైవి, చంద్రముఖి-2 కూడా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో చూస్తుండగానే కంగనా మార్కెట్ కరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు తను చేస్తున్న సినిమాలను కొనేందుకు బయ్యర్లు లేని దుస్థితి. ఎమర్జెన్సీ, తేజస్ సినిమాలు ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. రిలీజ్ డేట్స్‌ని అనౌన్స్ చేశాయి.

కానీ ఇప్పటివరకు బిజినెస్ జరగలేదు. ముఖ్యంగా కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ని ఒక ప్రాపగండా ఫిలింలా చూస్తున్నారు బయ్యర్లు. దీని పట్ల ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేసింది కంగనా. మొత్తానికి బాలీవుడ్ క్వీన్‌లా ఓ వెలుగు వెలిగిన కంగనా ఇప్పుడు చెతిలో ఉన్న సినిమాలను రిలీజ్ చేసుకోలేని పరిస్థితి. మరి ఎమర్జెన్సీ మూవీకి ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.