Kanguva glimpse: కంగువ.. అదిరే టీజర్
వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హిస్టరీ క్రియేట్ చేసే దిశగా కదులుతున్నారు.సూర్య నటిస్తున్న పీరియాడిక్ మూవీ 'కంగువా'. సూర్య పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అదిరిపోయే అవైటెడ్ గ్లింప్స్ ను సర్ ప్రైజ్గా రిలీజ్ చేశారు మేకర్స్.

Kanguva Movie Glimps Released Because of Surya Birthday
గ్లింప్స్ లో గుట్టలు గుట్టలుగా ఉన్న శవాలపై నుంచి సూర్య ఎంట్రీ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సూర్య యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీరలెవల్లో ఉంది. రోలెక్స్ ఎక్స్‌ప్రెషన్‌ను గుర్తు చేస్తూ కుశలమా’ అనే డైలాగ్‌తో సూర్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ …స్క్రీఅదిరేన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉండడమే కాకుండా.. ఇందులో ఆయన పవర్ ఫుల్ యోధునిగా కనిపించారు. ఆ వెంటనే.. వేలాది మంది సైన్యం కలిసి బాణాలు వేయడం.. సూర్య అరుస్తూ కనిపించడం అంతా ఓ విజువల్ ఫీస్ట్‌గా సూపర్‌గా అనిపించింది.
ఈ గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.జస్ట్ ఫస్ట్ గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే, టీజర్, ట్రైలర్‌లు, ఇక సినిమా ఏ లెవెల్లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టైటిల్అర్య పోస్టర్స్ సినిమాపై భారీగా హైప్ పెంచేశాయి.ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గ్లోబల్ రేంజ్‍లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. గ్లింప్స్ వీడియోను విడుదల చేసి.. సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించ గా సినిమాపై అంచనాలను భారీగా పెరిగిపోయాయి.