కంగువను నిండా ముంచిన పుష్ప, మరీ ఇంత దారుణమా…?

తమిళ స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో మాదిరి కాకుండా తమిళ సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే రేంజ్ లో డైరెక్టర్ లు ప్లాన్ చేస్తున్నారు. అందుకే మన తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 08:36 PMLast Updated on: Nov 14, 2024 | 8:36 PM

Kanguva Movie Has Been Severely Unfair In Telugu States

తమిళ స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో మాదిరి కాకుండా తమిళ సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే రేంజ్ లో డైరెక్టర్ లు ప్లాన్ చేస్తున్నారు. అందుకే మన తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా తెలుగులో సూర్యకు సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న మాట వాస్తవం. సూర్య సినిమాను మన తెలుగు స్టేట్స్ లో ఓ రేంజ్ లో ఆదరిస్తారు. అలాంటి సూర్యకు కంగువ సినిమా విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సినిమా విషయంలో మైండ్ గేమ్ మైనస్ అయింది అంటున్నారు ఆడియన్స్.

అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే… రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన సూర్య పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌ ‘కంగువ’ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయాలని సినిమా నిర్మాతలు భావించినా తీవ్ర అన్యాయం జరిగింది. రెండు సంస్థలు ఆడిన మైండ్ గేమ్స్‌లో సూర్య దారుణంగా బలి అయ్యాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ ను నైజాం ఏరియాలో ‘మైత్రి డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ తీసుకుంది. దీనితో నైజాం ఏరియాలో మేజర్ థియేటర్స్ కలిగిన మరొక సంస్థ ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

లాస్ట్ మినిట్ లో అంతా సెట్ అవుతుందని భావించినా… కాలేదు. మల్టీ ఫ్లేక్స్ లో కూడా సూర్య సినిమాకు దారుణంగా అన్యాయం జరిగింది. ‘పుష్ప 2’ సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్… డిస్ట్రిబ్యూటర్స్ గా మారారు. అదే సంస్థ ఇప్పుడు ‘కంగువ’ డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ ని తీసుకోగా… పుష్ప 2 రిలీజ్‌ కోసం… ఈ సంస్థ చేసిన కొన్ని పనులు ఏషియన్ సినిమాస్ సంస్థతో వివాదానికి వేదిక అయ్యాయి. ఆ ప్రభావం కంగువపై బాగా పడింది. దీనితో కీలకమైన నైజాం ఏరియాలో 30% థియేటర్స్ కూడా ఈ సినిమాకి రాలేదు.

ఏఎంబీ, ఏఏఏ స్క్రీన్స్ కూడా చివరి నిమిషంలో కేటాయించడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో కేవలం ఒకే ఒక్క పీవీఆర్ స్క్రీన్ ‘కంగువ’కి కేటాయించారు. సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ లో మంచి టాక్ వస్తుంది. కాని మైండ్ గేమ్ మాత్రం సినిమాను దెబ్బ కొట్టింది. ఈ ప్రభావం మన తెలుగు సినిమాలపై తమిళనాడులో పడే ఛాన్స్ ఉండవచ్చు. స్టార్ హీరోకే మన తెలుగులో ఇంత అన్యాయం జరిగితే… మన సినిమాలను తమిళంలో ఎలా ఆడిస్తారు అంటూ అనలిస్ట్ లు ఫైర్ అవుతున్నారు. ఫ్యూచర్ లో భారీ ప్రాజెక్ట్ లు పెట్టుకుని మైండ్ గేమ్స్ ఆడటం ఏంటీ అంటూ మండిపడుతున్నారు.