కంగువకు అంబాని షాక్, రిలీజ్ లేనట్టేనా…?

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై సూర్య ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని సూర్య ప్లాన్ చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2024 | 05:41 PMLast Updated on: Nov 03, 2024 | 5:41 PM

Kanguva Release Postponed

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై సూర్య ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని సూర్య ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే జరుగుతున్నాయి. సినిమా ట్రైలర్ కు మన తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

శివ దర్శకత్వంలో వహించిన కంగువలో బాబీ డియోల్, దిశా పటాని, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను చెన్నై, పాండిచ్చేరి, కేరళ, బ్యాంకాక్‌లలో గ్రాండ్ గా షూట్ చేసారు. వస్తున్న వార్తల ప్రకారం చూస్తే… కంగువలో అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఇందులో 10,000 మందికి పైగా పాల్గోన్నారట. వార్ ఎపిసోడ్‌ లు ఓ రేంజ్ లో షూట్ చేసారట. యాక్షన్, స్టంట్స్ మరియు విజువలైజేషన్ నుండి ప్రతీ ఒక్కటి సినిమా ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్ ఫీల్ వస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది.

ఈ సినిమాకు ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా భారీగా జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా, యూకే దేశాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ పై చాలానే హోప్స్ పెట్టుకుంది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. స్టూడియో గ్రీన్ అధినేత, నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా విషయంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీరియస్ గా ఉంది. పలు సినిమాలకు ఋణం తీసుకుని చెల్లించకపోవడం పట్ల చెన్నై హైకోర్టులో ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది. రిలయన్స్ హైకోర్ట్ మెట్లు ఎక్కింది.

ఆర్య నటించిన టెడ్డీ మరియు చియాన్ విక్రమ్ నటించిన తంగలన్ కోసం జ్ఞానవేల్ రాజా రిలయన్స్ నుండి రూ. 99.22 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు రూ.45 కోట్లు మాత్రమే చెల్లించాడు. రిలయన్స్ 55 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ అప్పు తిరిగి చెల్లించే వరకు కంగువ రిలీజ్ ను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది రిలయన్స్. అయితే ఈ కేసుపై విచారణను కోర్ట్ ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే సినిమా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడిన సంగతి తెలిసిందే.