దేవరని చూసి వాతలు పెట్టుకుంటే… వాతలే మిగిలాయా..?
దేవర మూవీ లో ఓ సెపరేట్ వరల్డ్ ని క్రియేట్ చేసింది ఫిల్మ్ టీం. ఇద్దరు ఎన్టీఆర్ లతో ఆ ప్రపంచం, పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేసింది. వర, దేవర పాత్రలకు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
దేవర మూవీ లో ఓ సెపరేట్ వరల్డ్ ని క్రియేట్ చేసింది ఫిల్మ్ టీం. ఇద్దరు ఎన్టీఆర్ లతో ఆ ప్రపంచం, పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేసింది. వర, దేవర పాత్రలకు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. కట్ చేస్తే, ఇలానే భారీతనం ఉంటే సినిమా ఆడుతుందని, వందలకోట్లు పెడితే, బాక్సాఫీస్ షేక్ అవుతుందని కలలు కంది అరవ కంగువా టీం. కలలు మంచిదే… కాని మనం ప్రయత్నించినప్పుడు, తమిళ ఆడియన్స్ దేవరనే కాదు, త్రిబుల్ ఆర్ నుంచి కల్కీ వరకు ప్రతీ తెలుగు హిట్ మూవీని లైట్ తీసుకుంది. కాని వాళ్ల వరకొచ్చేసరికి కంగువా అని అచ్చుగుద్దినట్టు, దేవర దారిలో నడిచారు… మరి అలా కాపీ కొడితే, కాసుల వర్షం కురిసిందా ? అంటే ఆన్సర్ తేలిపోయింది. బాహుబలి ని చూసి అప్పట్లో కార్తి వాతలు పెట్టుకుంటే, బాహుబలి, దేవర ఈ రెండీటి ప్రభావంతో సూర్య అండ్ టీం వాతలు పెట్టుకుందంటున్నారు… నిజమేనా?
పాన్ ఇండియా మూవీ మనం తీయాలి.. ఎన్టీఆర్, బన్నీ, చరణ్, ప్రభాస్ ని మించే హీరోలు మన దగ్గర కూడా ఉండాలి… ఇది అరవోళ్లు కసిగా తీసుకున్న నిర్ణయం… ఆ ప్రయత్నంలోనే దేవర బాటలో బాక్సాఫీస్ వేటకి వెళితే, వలలో చేపలు కాదు కదా, కనీసం వసూల్ల రూపంలో పిత్త పరిగలు కూడా పట్టుకోలేకపోయారనంటున్నార
సూర్య మంచి నటుడు. శివ మాస్ డైరెక్టర్ …కాని ఇంతవరకు పాన్ ఇండియా హిట్ ని, వెయ్యికోట్ల వసూళ్ల ముఖాన్నిచూడని కోలీవుడ్, ఏకంగా బాహుబలి, దేవరని మించే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది.. కంగువా పరిస్థితి అనేలా ఉందా?
దేవర అంటేనే అదో ప్రత్యేక ప్రపంచం… దాన్ని కొరటాల శివ స్రుష్టిస్తే, ఎన్టీఆర్ ఆ ప్రపంచానికి నాయకుడై, అంతా తానై దేవరని బాక్సాఫీస్ లో దూసుకెళ్లేలా చేశాడు. కంగువాని కూడా సూర్యనే అలా మోయాల్సిన పని పడింది..ఎందుకంటే కంగువలో స్టోరీ మరీ వీక్ గా ఉండటం, ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, దేవర, బాహుబలి స్టైల్ ని కాపీకొట్టడంలా ఉందనే కామెంట్లు పెరిగాయి
కంగువా కథ విషయానికొస్తే… ఈకాలంలో హీరోకి వెయ్యేల క్రితం కంగువాకి ఏదో కనెక్షన్ ఉంటుంది.. అది గత జన్మ లో చేసిన ప్రామిసా? లేదంటే ఏంటా కనెక్షన్… ఇంతకి కంగువ ఎవరు? ఈరెండు పాత్రల మధ్య వెయ్యేలా టైం గ్యాప్ ఎందుకుంటుందనేదే కథ..
పాయింట్ బాగున్నా, ఇదే కొత్త పాయింట్ కాదు. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ హీరోగా బింబి సార మూవీ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ అదే కథ కాకున్నా, బింబి సారే వెయ్యిరెట్లు బెటర్ అంటున్నారు. బాహుబలి స్టైల్లో భారీ తనం. రకరకాల జాతులు… భారీగా గెటప్పులు… ఇక బింబిసారలాంటి స్టోరీలైన్… ఇక దేవర లా కంగువాలో సూర్య పాత్ర.. ఇలా ఒక సినిమాలో మూడు తెలుగు మూవీల ఇన్స్ పిరేషన్ కనిపిస్తోందంటున్నారు
కంగువలో కథ కంటే వ్యధే ఎక్కువుంది?.. దేవిశ్రీ మ్యూజిక్ కొంత సేపు మ్యాజిక్ చేసినా, కథలో లేని జిమ్మిక్ మ్యూజిక్ చేసే పరిస్థితి లేదు.. గ్రాండ్ స్కేల్ లో బాక్సాఫీస్ బెండు తీయబోతే, సీన్ రివర్స్ అయినట్టుంది. కథ, కథనం, పాత్రలు, మేకింగ్, అన్ని బెడిసి కొడుతున్నాయి. టాక్ వీకైంది. టాక్ ని బట్టి చూస్తుంటే పాన్ ఇండియా లెవల్లో కంగువాకి పంచ్ పడినట్టే కనిపిస్తోంది.