KANGUVA VS KALKI 2898 AD: కంగువ కథ అదే అయితే.. కల్కి కత్తిరిస్తాడు..

కల్కి కథలో ఇద్దరు ప్రభాస్‌లుంటారు. ఒకరు కృష్ణుడి అంశగా పుట్టిన భైరవ, అలాగే శ్రీవిష్ణు అవతారంగా వచ్చే కల్కి.. ఇలా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. మహాభారత యుద్దం ముగిసినప్పటి కాలం నుంచి ఈ తరంలో 2898 కాలం వరకు జరిగే కాల ప్రయాణమే ఈ మూవీ కథ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 03:37 PMLast Updated on: Mar 23, 2024 | 3:37 PM

Kanguva Vs Kalki 2898 Ad Both Moives Coming With Same Concept

KANGUVA VS KALKI 2898 AD: తమిళ స్టార్ సూర్యతో శివ తీస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువ. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా కథ, ఇంచుమించు కల్కి 2898 ఏడీ మూవీతో పోలుతోందట. ఇలా దాదాపు రెండు వారాలుగా ఈ గుసగుసలు పెరిగాయి. మొదట్లో ఇవన్నీ కేవలం పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కాని ఈమూవీ కాన్సెప్ట్ కూడా మెల్లిగా కల్కితో పోలుస్తుంటే ఎక్కడో లింక్ సింక్ అయ్యేలా ఉంది. కల్కి కథలో ఇద్దరు ప్రభాస్‌లుంటారు.

HYPER ADI: పవన్‌ కోసం హైపర్ ఆది.. ఏం చేయబోతున్నాడో తెలుసా..

ఒకరు కృష్ణుడి అంశగా పుట్టిన భైరవ, అలాగే శ్రీవిష్ణు అవతారంగా వచ్చే కల్కి.. ఇలా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. మహాభారత యుద్దం ముగిసినప్పటి కాలం నుంచి ఈ తరంలో 2898 కాలం వరకు జరిగే కాల ప్రయాణమే ఈ మూవీ కథ. ఇక అందులో హీరో ఏం చేస్తాడు, విలన్ ఎవరు, అసలు పోరాటం ఏంటనేది మరో కోణం. ఈ సంగతి అటుంచితే, కంగువాలో కూడా హీరో ఇలాగే కాలంలో ప్రయాణం చేస్తాడట. చోళుల కాలానికి ముందు నుంచి ఈ తరం వరకు హీరోకి మరణం లేకపోతే, అన్న పాయింట్‌తో ఈ సినిమా వస్తోందట. అశ్వద్ధామ పాత్రే ప్రేరణగా ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. కల్కిలో శ్రీవిష్ణు అవతారం అయితే, ఇక్కడ మరణం లేకుండా వేల ఏల్లుగా బతుకుతున్న అశ్వద్ధామ పాత్ర.

ఇలా క్యారెక్టర్స్ వేరు కాని, కాల ప్రయాణం సేమ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ మాత్రానికే రెండూ ఒకే కథ అనలేం. ఒకవేళ ఎక్కువ పోలికలు ఉండి ఉంటే కనక కంగువ మూవీకే కష్టాలు తప్పవు. ఎందుకంటే కంగువ కంటే కల్కీ మూవీనే ముందుగా రాబోతోంది. అలా చూస్తే కల్కి చూసిన జనాలకు కంగువ థ్రిల్ అనిపించదనే అభిప్రాయముంది.