కన్నడపై ఎన్టీఆర్ మమకారం…? కీలక నటులు అందరూ కన్నడే…?

మన స్టార్ హీరోలు ఇతర భాషల్లో సినిమాలు చేయాలి అనుకోవడం లేదా అక్కడ మార్కెట్ పెంచుకోవాలి అనుకోవడం అనేది సర్వ సాధారణ విషయం. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అల్లు ఆర్జున్ ఎన్టీఆర్ ఇతర భాషల మార్కెట్ మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2024 | 04:07 PMLast Updated on: Oct 12, 2024 | 4:07 PM

Kannada Actors In Ntr Neel Movie

మన స్టార్ హీరోలు ఇతర భాషల్లో సినిమాలు చేయాలి అనుకోవడం లేదా అక్కడ మార్కెట్ పెంచుకోవాలి అనుకోవడం అనేది సర్వ సాధారణ విషయం. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అల్లు ఆర్జున్ ఎన్టీఆర్ ఇతర భాషల మార్కెట్ మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కి కేరళలో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలను అక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇక విదేశాల్లో కూడా ఇప్పుడు సినిమాలను మార్కెటింగ్ చేసే ప్లాన్ చేస్తున్నాడు.

ఇక పుష్ప 2 సినిమాతో నార్త్ మార్కెట్ మీద కూడా పట్టు పెంచుకోవాలని బన్నీ ప్లాన్ మొదలుపెట్టాడు. ఇక బన్నీని ఈ విషయంలో ఫాలో అవుతున్న అల్లు అర్జున్ కూడా ఇతర భాషల్లో పట్టు పెంచుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు కన్నడ, తమిళం, హిందీ మార్కెట్ లో పట్టు కోసం ఎన్టీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. దేవర సినిమాను హిందీలో ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు. అలాగే కన్నడంలో కూడా ఆలాగే ప్రమోట్ చేసాడు. ఈ రెండు చోట్ల వసూళ్లు భారీగానే వచ్చాయి దేవర సినిమాకి.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో కూడా ఇప్పటి నుంచే మార్కెటింగ్ చేస్తున్నాడు సైలెంట్ గా. అసలు ఏం చేస్తున్నాడు ఏంటీ అనేది ఒకసారి చూస్తే… తన సినిమాలో మొత్తం కన్నడ లేదా తమిళం చివరిగా హిందీ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ అనిరుద్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టికి అలాగే శివ రాజ్ కుమార్ కి కీలక పాత్రలు ఇవ్వాలని భావిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో శింభుకి కూడా ఈ సినిమాలో ఓ రోల్ ఉండే అవకాశం ఉంది.

అలాగే ఇక తన తండ్రి పాత్రకు గానూ శివ రాజ్ కుమార్ ని తీసుకోవాలని ప్రశాంత్ నీల్ కి చెప్పినట్టు సమాచారం. అలాగే ఇతర కీలక పాత్రలకు కూడా కన్నడ నటులను ఎంపిక చేయాలని సూచనలు ఇస్తున్నాడట. మరి ఈ కన్నడ పిచ్చి ఏంటో అర్ధం కావడం లేదు అంటున్నారు జనాలు. తన తల్లి సొంత రాష్ట్రం కర్ణాటక. ఇటీవల కర్ణాటక కూడా వెళ్లి వచ్చాడు బన్నీ. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ఎన్టీఆర్ తోనే ఎక్కువగా తిరిగిన సంగతి తెలిసిందే. ఇక కాంతారా 2 లో కూడా ఎన్టీఆర్ కనపడే అవకాశం ఉందని అంటున్నారు.