బాలయ్య వెంట పడుతున్న కన్నడ హీరో.. కాంతారా తెలుగు వెర్షన్ కోసమే…

మన తెలుగు సినిమాలు కన్నడపై ఎలా ఫోకస్ పెట్టారో... కన్నడ సినిమాలు కూడా తెలుగుపై అదే రేంజ్ లో ఫోకస్ పెట్టి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 12:55 PMLast Updated on: Feb 12, 2025 | 12:55 PM

Kannada Hero Chasing Balayya Kantara Is Only For Telugu Version

మన తెలుగు సినిమాలు కన్నడపై ఎలా ఫోకస్ పెట్టారో… కన్నడ సినిమాలు కూడా తెలుగుపై అదే రేంజ్ లో ఫోకస్ పెట్టి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. కన్నడ సినిమాలకు మన తెలుగులో కేజిఎఫ్ నుంచి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కాంతారా సినిమా తెలుగులో ఆ సినిమా తెలుగులో భారీగా కలెక్షన్స్ సాధించడంతో మేకర్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ కూడా వస్తోంది. ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలను ఉన్నాయి. ఆ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ఆడియన్స్ జై కొట్టారు.

చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఆ సినిమా.. ఆ రేంజ్ లో హిట్ అవుతుందని మేకర్స్ ఏ మాత్రం ఊహించలేదు. ఆ సినిమా క్లైమాక్స్ ఇప్పటికీ జనాలు ఏదో ఒక సందర్భంలో చూస్తూనే ఉంటారు. దీనికి సంబంధించిన రీల్స్ కూడా సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతాయి. ఇక ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ విషయంలో డైరెక్టర్ రిశబ్ శెట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

ఇక మన తెలుగులో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎప్పటి నుంచే వర్కౌట్స్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉందనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదే ఈ సినిమాకు తెలుగులో బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కు బాలయ్య వాయిస్ ఓవర్ బావుంటుందని మేకర్స్ భావించినట్లు సమాచారం.

అందుకే ఇప్పటికే బాలయ్యను అప్రోచ్ కూడా అయ్యారట. ఇక తమిళంలో కార్తీక్ తో వాయిస్ ఓవర్ తీసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. హిందీలో రణవీర్ సింగ్ తో వాయిస్ ఓవర్ తీసుకుని సినిమాకు హైప్ భారీగా క్రియేట్ అయ్యేలా చూడాలని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ ప్లాన్ చేస్తోంది. ఇదే జరిగితే ఖచ్చితంగా మూడు భాషల్లో కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉందని మేకర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో కచ్చితంగా మన తెలుగులో కూడా కన్నడ డామినేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని లెక్కలు ఉన్నాయి. దాదాపు 350 కోట్లకు పైగా కాంతారా సినిమా అప్పుడు కలెక్ట్ చేసింది. ప్రీక్వెల్ దాదాపు 600 నుంచి 800 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. బడ్జెట్ కూడా ఈ సినిమాకు చాలా తక్కువ. అయితే ఈ సినిమాను మలయాళం లో లేటుగా రిలీజ్ చేయాలని.. ముందు తెలుగు, తమిళ, కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.