Neha Shetty:సైలెంట్ గా దూసుకెళ్ళిపోతున్నావేంటి రాధిక.?
కన్నడ యాక్టర్ కస్తూరి నేహశెట్టి వ్యహం ఇదే.

Kannada heroine Neha Shetty who is rushing with a series of movie offers
హీరోయిన్ ఎవరైనా అందంగా మంచి సొగసులతో ఉంటే సరిపోదు.దాన్ని ప్రమోట్ చేసుకోవడం తెలియాలి. సైలెంట్ గా ఆఫర్స్ అందుకుని లైమ్ లైట్ లోకి వచ్చేయాలి. ప్రజెంట్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది కన్నడ కస్తూరి నేహ శెట్టి. ఒకే సారి 3 సినిమాల్లో నటిస్తూ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రొసెస్ ని షురూ చేసింది.
టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ కృతి శెట్టి హవా నడిచింది. ప్రస్తుతం శ్రీలీల జోరు కొనసాగుతోంది. అయితే ప్రమోషన్ పరంగా చూసుకుంటే నేహా శెట్టి కూడా ఈ లీగ్ లోకి దూసుకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలతో ఈ బ్యూటీ సందడి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రాధిక అలియస్ నేహా శెట్టి పోటోలే కనిపిస్తున్నాయి.
డీజే టిల్లు ఇచ్చిన క్రేజ్ తో వరుసపెట్టి సినిమాలకు ఓకే చెప్పింది నేహా శెట్టి. ఆశ్చర్యంగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. కార్తికేయ సరసన బెదురులంక అనే సినిమా చేసింది. ఈ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. అలాగే విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ మూవీస్ లో నటిస్తోంది.ఇందులో విశ్వక్ సేన్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే.. ఆక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రూల్స్ రంజన్ రెడీ అవుతోంది. అంటే 4-5 నెలల గ్యాప్ లో 3 సినిమాలతో నేహా శెట్టి ఆడియన్స్ ని థ్రిల్ చేయనుంది.మరి ఈ సినిమాలు ఈ బ్యూటీ కెరీర్ కి ఎంత వరకు హైలెట్ చేస్తాయో చూడాలి.