మన టాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ కంటే వేరే లాంగ్వేజెస్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్.. మొదలైన తర్వాత ఇతర భాషల్లో సినిమాల కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప పార్ట్ 2 తో నార్త్ ఇండియా మార్కెట్ ను ఓ రేంజ్ లో క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా తెలుగులో కంటే అక్కడ ఎక్కువ సక్సెస్ అయ్యింది. తమిళం, కన్నడలో పెద్దగా సినిమా ఆడకపోయినా హిందీలో మాత్రం ఒక రేంజ్ లో దుమ్ము రేపింది. ఇక ఎన్టీఆర్ దేవరా సినిమాతో కన్నడ, తమిళంలో తాను ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ కూడా ఇప్పుడు కన్నడ, తమిళ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. తెలుగు హీరోలు సినిమాలకు కన్నడ, తమిళంలో క్రేజ్ పెరగడం, అక్కడి డైరెక్టర్లు కూడా మన హీరోలతో సినిమాలు చేయడంతో అక్కడ కాస్త బజ్ భారీగానే క్రియేట్ అవుతుందనే చెప్పాలి. ప్రభాస్.. ప్రశాంత్ నీల్ ఒక సినిమా ఇప్పటికే కంప్లీట్ చేశాడు. త్వరలోనే సలార్ 2 సినిమా షూటింగ్ కూడా ఉంటుంది. ఇక డైరెక్ట్ గా కన్నడ అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ఈ మూడు సినిమాలు కన్నడలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అటు కన్నడ సినిమాలు కూడా మన తెలుగులో ఎక్కువగా ఆడటంతో.. కన్నడ వాళ్ళు కూడా పెద్దగా తెలుగు సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేయడం లేదు. రీసెంట్ గా పుష్ప సినిమాతో కాస్త రచ్చ జరిగింది. పుష్ప పార్ట్ 2 సినిమా డిస్ట్రిబ్యూటర్స్ చేసిన కామెంట్స్ తో కాస్త కన్నడలో డిస్టబెన్స్ క్రియేట్ అయింది. కానీ దాదాపుగా అది క్లియర్ అయినట్టుగానే కనబడుతోంది. ఇక ప్రభాస్ కూడా తన సినిమాల్లో కన్నడ యాక్టర్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను స్పిరిట్ సినిమాలో తీసుకోవాలని.. ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు క్లారిటీ ఇచ్చాడు. శివ రాజ్ కుమార్ ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల్లో కూడా ఆయన నటించడంతో శివరాజ్ కుమార్ కు తెలుగు సినిమా ఎక్కువ వెయిట్ ఇవ్వడంతో కన్నడ వాళ్ళు కూడా కాస్త ఖుషీ అవుతున్నారు. లోకల్ ఫీలింగ్ ఎక్కువ చూపించే కన్నడ ఫాన్స్ తమ హీరోలకు తెలుగువాళ్లు ప్రయారిటీ ఇవ్వటంతో ఫుల్ జోష్లో ఉన్నారు. అటు కాంతారా సినిమా హీరో డైరెక్టర్ రిషిబ్ శెట్టి కూడా మన తెలుగు వాళ్లకు కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. దీనితో ఎన్టీఆర్ వంటి వాళ్ళు రిషబ్ శెట్టికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అప్పుడప్పుడు కలుస్తున్నారు. ఇలా రామ్ చరణ్.. ప్రభాస్, ఎన్టీఆర్ అందరూ కూడా కన్నడ మార్కెట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం చూసి అటు తమిళ వాళ్లు కూడా కుళ్లుకునే పరిస్థితి ఉంది. వాస్తవానికి తమిళ వాళ్లకు కన్నడ వాళ్లకు గ్యాప్ ఉంటుంది. కావేరీ నది విషయంలో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. దీనితో తమిళ సినిమాలు ఎక్కువగా కన్నడలో డామినేట్ చేయవు. హిందీ డామినేషన్ కూడా కన్నడ వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. అందుకే తెలుగును ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మన తెలుగు హీరోలు కూడా రెడీ అయిపోయారు.[embed]https://www.youtube.com/watch?v=VEfV_KirMMw[/embed]