బాలయ్య కోసం కన్నడ ప్రొడక్షన్స్ హౌస్ టాలీవుడ్ ఎంట్రీ..?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది బాలకృష్ణకు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది బాలకృష్ణకు. డాకు మహారాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బాలకృష్ణ, తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలోపడ్డారు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ 50% కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే మరి కొంత షూటింగ్ ను వేగంగా బాలయ్య కంప్లీట్ చేస్తారు. ఆయన పార్ట్ కంప్లీట్ చేసేసి ఆయనను రిలీజ్ చేయాలని బోయపాటి టార్గెట్ పెట్టుకున్నాడు.
ఈ సినిమా పూర్తికాక ముందే బాలకృష్ణ మరో మూవీపై కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు ఆయన సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక బాలయ్య లేకుండానే త్వరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని డైరెక్టర్ గోపీచంద్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కంటే ఈ సినిమాలో బాలయ్య కాస్త డిఫరెంట్ గా ఉంటారట.
బాలయ్యకు వీరసింహారెడ్డి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు మరో హిట్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. స్టోరీ ఆల్మోస్ట్ బాలయ్యకు తగ్గట్టు మార్చేశాడు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఆ స్టోరీ ఫాలోఅప్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలకృష్ణ, త్వరలోనే మరో సీనియర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అనే టాక్ వినబడుతుంది. హరీష్ శంకర్ చెప్పిన ఒక స్టోరీ లైన్.. బాలకృష్ణ తో పాటు ఆయన చిన్న కుమార్తె తేజస్వినికి కూడా బాగా నచ్చేసిందట.
ఇక ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రముఖ బ్యానర్ ఒకటి ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ టాక్సిక్ సినిమా తెరకెక్కిస్తున్న కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్.. బాలయ్య, హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోయే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టాలని ప్లాన్ చేసుకుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావచ్చని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమాను సైన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు తోనూ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా లేటవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా బాలకృష్ణతో సినిమా కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ టార్గెట్ పెట్టుకున్నాడు.