టాలీవుడ్ కు కన్నడ షాక్, కన్నడలో మన సినిమాల రిలీజ్ బ్రేక్ పడ్డట్టేనా…?
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమా హవా ఎక్కువగా నడుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలకు ఒక పాన్ ఇండియా సినిమా విడుదలవుతూ... ఇతర భాషల హీరోల సినిమాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమా హవా ఎక్కువగా నడుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలకు ఒక పాన్ ఇండియా సినిమా విడుదలవుతూ… ఇతర భాషల హీరోల సినిమాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభావం బాలీవుడ్ అలాగే కన్నడ సినిమాపై ఎక్కువగా పడుతుంది. ముందు నుంచి కన్నడ సినిమాలపై తెలుగు డామినేషన్ కాస్త ఎక్కువగానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు సినిమాల దెబ్బకు కన్నడ సినిమా పరిశ్రమ కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నట్టుగా క్లారిటీ వస్తుంది.
దేవర సినిమా కారణంగా అక్కడ కొన్ని చిన్న సినిమాలు కూడా వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా కారణంగా కన్నడ సినిమా మరింత ఇబ్బంది పడుతుందని టాక్. పుష్ప 2 సినిమా కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాను అక్కడ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడం అక్కడి హీరోలకు కూడా నచ్చటం లేదని అంటున్నారు. గతంలో ఇలాగే తెలుగు సినిమా నుంచి ఇబ్బందులు ఉన్న సమయంలో కన్నడ కంటిరవ రాజకుమార్ తెలుగు సినిమాలను బ్యాన్ చేయాలని అప్పట్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
ఆయన బ్రతికి ఉన్నంత వరకు తెలుగు సినిమాను అక్కడ నిషేధించింది కన్నడ సినిమా పరిశ్రమ. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలకు అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలను మళ్లీ బ్యాన్ చేసే ఆలోచనలో కన్నడ సినిమా ఉందని అంటున్నారు. దాదాపుగా థియేటర్ లన్ని తెలుగు సినిమాలు తీసుకుంటున్నాయని దేవర సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఫైర్ లో ఉన్నారట. భవిష్యత్తులో ప్రభాస్ సినిమాలు విషయంలో కూడా ఇదే జరగబోతుందని కన్నడ సినిమా భయపడుతోంది.
అందుకే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అక్కడి నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. అటు స్టార్ హీరోలు కూడా తెలుగు సినిమా డామినేషన్ పై సీరియస్ గానే ఉండటంతో త్వరలోనే ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనబడుతోంది. కన్నడ సినిమాకు దాదాపు అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో భారీగా థియేటర్లు కేటాయిస్తూ ఉంటారు. కీలక ప్రాంతాలైన బెంగళూరు, మైసూరు, బళ్ళారి వంటి ప్రాంతాల్లో తెలుగు సినిమా డామినేషన్ ఎక్కువగా కనబడుతోంది. దీనిపై గతంలో కూడా విమర్శలు వచ్చాయి. కన్నడ సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన సినిమాలు కేజిఎఫ్ కాంతారా వంటి పాన్ ఇండియా సినిమా రికార్డులను కూడా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇబ్బంది పెట్టింది.