‘కన్నప్ప’ రొమాంటిక్ సాంగ్.. మీరు తీసే సినిమా ఏంటి.. అక్కడున్న పాటేంటి..?

మీరు ఎంచుకున్న రాగం ఏంటి.. తీసుకున్న తాళం ఏంటి..! అక్కడ ఉన్న టెంపో ఏంటి.. మీరు పాడుతున్న టెంపో ఏంటి..? కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్ గుర్తున్నాయి కదా..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 04:20 PMLast Updated on: Mar 11, 2025 | 4:20 PM

Kannappa Is A Romantic Song What Movie Are You Making What Song Is There

మీరు ఎంచుకున్న రాగం ఏంటి.. తీసుకున్న తాళం ఏంటి..! అక్కడ ఉన్న టెంపో ఏంటి.. మీరు పాడుతున్న టెంపో ఏంటి..? కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్ గుర్తున్నాయి కదా..! ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను చూసి ఇదే అంటున్నారు ఆడియన్స్. మీరు తీసుకున్న సినిమా కథ ఏంటి.. మీరు ఇప్పుడు చేసిన పాట ఏంటి.. అసలు ఏమన్నా సంబంధం ఉందా విష్ణు గారు అని ట్రోలింగ్ మొదలైంది ఈ సినిమాపై. దీనికి కారణం తాజాగా ఈ సినిమా నుంచి విడుదలగా రొమాంటిక్ సాంగ్..! నిజం చెప్పాలంటే కన్నప్ప సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ఏం వచ్చినా కూడా అందరి కంటే ముందు ఫోకస్ చేస్తున్నది కూడా ట్రోలర్సే. విష్ణుకు కూడా ఈ విషయం తెలుసు.. అయినా కూడా కామ్‌గానే ఉన్నాడు.

ఎందుకంటే అలా కూడా సినిమాకు ప్రమోషన్ వస్తుందని..! నిజానికి ఇదివరకే తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి ఓపెన్ అయ్యాడు విష్ణు. తాజాగా కన్నప్ప సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ఈ సినిమా నుంచి వచ్చిన రెండో పాట ఇది. నిజానికి కన్నప్ప మొదటి పాటపైనే ట్రోలింగ్స్ వస్తాయనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఆ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శివ శివ శంకరా అంటూ సాగే పాటలో శివుడి ఆరాధన అద్బుతంగా ఉండటమే కాదు.. ట్యూన్ కూడా క్యాచీగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ట్రోలర్స్‌కు దొరకనంతగా ఆ పాట బాగా రీచ్ అయిపోయింది. తాజాగా రెండో పాట వచ్చింది.. ఈసారి మాత్రం ట్రోలర్స్‌కు బాగానే పని చెప్తున్నాడు మంచు విష్ణు. తీసే సినిమా ఏమో అప్పుడెప్పుడో పూర్వకాలం నాటి కథ.. కానీ ఇప్పుడొచ్చిన పాట చూస్తుంటే మాత్రం ఈ జనరేషన్ మాదిరి అనిపిస్తుంది.

స్టైలిష్ గెటప్స్, ట్యూన్స్ అన్నీ ఈజీగా దొరికిపోయేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా భక్తి సినిమాలో ఈ రేంజ్ రక్తి అంత మంచిది కాదేమో అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గతంలోనూ శ్రీ ఆంజనేయంలో ఛార్మి.. పాండురంగడులో టబు ఓవర్ గ్లామర్ సినిమాలను ముంచేసాయి. తాజాగా ప్రీతి ముకుందన్ కూడా ఈ పాటలో బాగా రెచ్చిపోయింది. భక్తి సినిమా తీస్తున్నపుడు అదే లిమిటేషన్స్‌లో ఉంటే మంచిది కానీ రెచ్చిపోతే మాత్రం ఆ తర్వాత వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుందని హెచ్చిరిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఎప్రిల్ 25న విడుదల కానుంది కన్నప్ప. మరి చూడాలిక.. ఈ కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడో..?