kantara: ఈసారి అంతకు మించి.. కాంతార ఛాప్టర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్..
కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిస్తే.. వరల్డ్ వైడ్‌గా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నిజానికి కాంతారా సినిమాకు ఆ స్థాయి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్, డైరెక్టర్ కూడా ఊహించలేదు. ఆ స్పందన చూసిన తర్వాత ఈ సినిమా ఛాప్టర్ 1ని భారీగా ప్లాన్ చేశారు.
kantara: ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా స్థాయిలో కాసుల వర్షం కురింపించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి డైరెక్టర్, హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ మూవీకి దేశవ్యాప్తంగా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిస్తే.. వరల్డ్ వైడ్‌గా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నిజానికి కాంతారా సినిమాకు ఆ స్థాయి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్, డైరెక్టర్ కూడా ఊహించలేదు. ఆ స్పందన చూసిన తర్వాత ఈ సినిమా ఛాప్టర్ 1ని భారీగా ప్లాన్ చేశారు.
Bigg Boss : రతికకు షాకిచ్చిన రైతుబిడ్డ, శివాజీ.. బతిమలాడినా తప్పని ఎలిమినేషన్
కాంతార సినిమాకి ముందు ఏం జరిగింది అంటూ ఒక ప్రీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. కాంతార ప్రీక్వెల్‌ను ఎవరూ ఊహించని రీతిలో భారీ బడ్జెట్‌తో తీసుకొస్తున్నారు. ఈసారి సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే అందుకు తగిన అవుట్ పుట్ ఉంటుందని డైరెక్టర్ హామీ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ విషయానికి వస్తే.. కాంతార సినిమాలో హీరోకి ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అడవిలో వేటకు వెళ్లినప్పుడు ఎంతో భయపడుతూ ఉంటాడు. వరాహ మూర్తి రూపం తనను వెంబడిస్తున్నట్లు ఫీలవుతాడు. అలాంటి ఒక సీన్‌నే ఈ ఫస్ట్ లుక్‌లో చూపించారు. అందుకు వాయిస్‌లో “వెలుగులో అంతా కనిపిస్తుంది, కానీ, అది కేవలం వెలుగు మాత్రమే కాదు దర్శనం. ఆ వెలుగులో గతంలో జరిగింది. భవిష్యత్తులో జరగబోయేది అంతా కనిపిస్తుంది” అంటూ చెప్పించారు. ఆ తర్వాత శివుడి ఆకారంలో ఉన్న రిషబ్ శెట్టిని చూపించారు. కండలు తిరిగిన దేహం, చేతిలో గొడ్డలి, పక్కన త్రిశూలం ఉన్నాయి.
కళ్లల్లో అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. పోస్టర్ చూస్తే ఎవరో కొందరు దాడి చేసేందుకు వస్తున్నట్లు చూపించారు. అయితే ఈ పోస్టర్, ఫస్ట్ లుక్ ఆధారంగా చూస్తే కాంతారా ప్రీక్వెల్ కచ్చితంగా భారీగా ఉండబోతోంది. కథలో కూడా రిషబ్ శెట్టి చాలానే మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో తమ కుటుంబం, తమ ఊరి ప్రజల విషయంలో జరిగిన అన్యాయాలు, దాడులు, హీరో తండ్రి భూతకోలా ఆడే ఒక స్వామిగా ఎలా మారారు.. వారికి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి.. అసలు వారు కొలిచే వారాహ మూర్తి కథ ఏంటి వంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ప్రీక్వెల్‌లో సమాధానం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా కచ్చితంగా భారీగానే ఉండబోతోంది. ఇంక నిర్మాణ విలువల విషయంలో విజయ్ కిరగందూర్ ఎక్కడా రాజీ పడినట్లు కనిపించడం లేదు. కాబట్టి ఈ కాంతార ఛాప్టర్ 1 కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.