Kapil Sharma : ఆ షో కోసం రూ. 5 కోట్లా…

మారుతున్న కాలంతో పాటు ప్రేక్ష‌కుల అభిరుచులూ మారిపోతున్నాయి.. బుల్లి తెర, వెండి తెర‌ల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. ఒక‌ప్పుడు సినిమా వాళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన స్టార్ హోదా ఇప్పుడు టీవీ ఇండ‌స్ట్రీకి కూడా పాకిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2024 | 05:30 PMLast Updated on: May 02, 2024 | 5:30 PM

Kapil Sharmas Salary Is 5 Crores For Greatindian Kapil Show

 

 

 

మారుతున్న కాలంతో పాటు ప్రేక్ష‌కుల అభిరుచులూ మారిపోతున్నాయి.. బుల్లి తెర, వెండి తెర‌ల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. ఒక‌ప్పుడు సినిమా వాళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన స్టార్ హోదా ఇప్పుడు టీవీ ఇండ‌స్ట్రీకి కూడా పాకిపోయింది. సినీ తార‌ల‌కు ద‌క్కుతున్న క్రేజ్ ఇప్పుడు బుల్లి తెర న‌టీన‌టులు, యాంక‌ర్ల‌కు కూడా దక్కుతోంది. ఇది కేవ‌లం పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం లేదు.. టీవీల్లో క‌నిపించే కొంద‌రు న‌టీన‌టులు, యాంక‌ర్స్‌కి సినిమాలోని హీరోహీరోయిన్ల‌ను మించి కూడా అధిక రెమ్యూన‌రేష‌న్ దక్కుతోంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ఆ రేంజ్‌లో దూసుకుపోతున్న స్టార్ క‌పిల్ శ‌ర్మ‌.. సినిమాల ద్వారా నటుడిగా దక్కిన గుర్తింపు, పారితోషికం కంటే, ఇప్పుడు టీవీ రంగంలో ఆయనకు దక్కిన గుర్తింపు, వస్తున్న పారితోషికం ఎన్నో రెట్లు ఎక్కువ.. ఇక‌.. లేటెస్ట్‌గా క‌పిల్ శ‌ర్మ చేస్తున్న ఓ షో కోసం ఆయ‌న తీసుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

‘ది క‌పిల్ శ‌ర్మ’ (The Kapil Sharma) షోతో క‌పిల్ శ‌ర్మ ఎంత‌గా ఫేమ‌స్ అయ్యాడో అంద‌రికీ తెలిసిందే.. దీంతోపాటు.. కామెడీ నైట్స్ విత్‌ కపిల్‌ షో తో పాటు ఇంకా ఎన్నో కామెడీ షో లను హోస్ట్‌ గా, జడ్జ్ గా, మెంటర్‌ గా వ్యవహరించి ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్నాడు.. ప్రస్తుతం ఆయ‌న నెట్‌ ఫ్లిక్స్ కోసం గ్రేట్ ఇండియన్‌ కపిల్‌ షో (Great Indian Kapil Show) ను చేస్తున్నాడు. ఈ షో కోసం కపిల్‌ శర్మ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ షోలో ఒకొక్క ఎపిసోడ్‌ కి గాను కోసం క‌పిల్ శ‌ర్మ ఏకంగా 5 కోట్ల పారితోషికం ను తీసుకుంటున్నాడ‌ట‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కండ‌ల వీరుడు సల్మాన్‌ బిగ్‌ బాస్‌ హోస్ట్‌ గా అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఆయన పక్కన కపిల్ శర్మ నిలిచి రికార్డు సృష్టించాడు.

ఈ గ్రేటిండియన్ క‌పిల్ షో 15 నుంచి 20 ఎపిసోడ్స్ వరకు ఉండే అవ‌కాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఒక‌వేళ ఈ సీజన్ గ‌న‌క‌ హిట్‌ అయితే ముందు ముందు మరిన్ని సీజన్ లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.. ఈ లెక్క‌న అప్‌క‌మింగ్ సీజ‌న్స్‌కు క‌పిల్ శ‌ర్మ రెమ్యూన‌రేష‌న్ పెంచినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు. ఇక‌… గ్రేట్‌ ఇండియన్ కపిల్‌ షో కోసం కపిల్‌ శర్మ కి ఒక్కో ఎపిసోడ్‌ కి 5 కోట్ల పారితోషికం ఇస్తుండగా… అదే షో లో కనిపించే గెస్ట్‌ జడ్జ్ నటి అర్చన సింగ్ కు ఒక్కో ఎపిసోడ్‌ కి 10 లక్షల పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి స్టార్‌ హీరోల స్థాయిలో కపిల్‌ శర్మ టైం నడుస్తోందని.. టైం బాగుంటే ఎవ్వ‌రూ ఆప‌లేరంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు..