రాజమౌళి వెంటపడుతున్న కరణ్ జోహార్.. అందుకే ఈ స్టేట్మెంట్…?
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అంటే ఏంటో ఇండియన్ సినిమాకు క్లారిటీ వచ్చింది. ఆయన విజన్ పై జనాలకు పిచ్చ క్లారిటీ ఉంది.

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అంటే ఏంటో ఇండియన్ సినిమాకు క్లారిటీ వచ్చింది. ఆయన విజన్ పై జనాలకు పిచ్చ క్లారిటీ ఉంది. అందుకే రాజమౌళి ఏ సినిమా చేసిన సరే జనాల్లో.. అదే లెవెల్లో క్రేజ్ ఉంటుంది. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయ్యింది. రాజమౌళి సినిమాల్లో చేసే హీరోల రేంజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెంచిన రాజమౌళి.. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా హీరోలు చేశాడు.
ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్ లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మూడు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమా.. ఫస్ట్ పార్ట్ 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. తన గత సినిమాల కంటే కూడా ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడు. గత సినిమాల్లో జరిగిన తప్పులు, టైం వేస్ట్ ఈ సినిమాలో జరగకూడదని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా.. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం విలన్ గా ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేశారు. హాలీవుడ్ లో ఫేమస్ అయిన ప్రియాంక చోప్రా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాడు జక్కన్న. ఇక హీరోయిన్ గా మరో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే కెన్యాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
ఇక తర్వాత బ్రెజిల్ వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రియాంక చోప్రా డైరెక్ట్ గా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.. ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా కు 30 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక రాజమౌళి సినిమాలపై అటు బాలీవుడ్ కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతోంది. ఒకప్పుడు రాజమౌళిని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్ నిర్మాతలు.. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. రాజమౌళి తీసిన కొన్ని సినిమాలకు లాజిక్ అవసరం లేదని.. కథ పై పూర్తి విశ్వాసం ఉంచి ప్రేక్షకులకు నమ్మకం కలిగించే సినిమాలను రాజమౌళి తర్కెక్కిస్తారని ఆకాశానికి ఎత్తేసాడు. గొప్ప సినిమాలకు లాజిక్ తో పనిలేదు అన్నాడు. త్రిబుల్ ఆర్, గధర్, యానిమల్ వంటి సినిమాలు అందుకు నిదర్శనమని కామెంట్ చేశాడు కరణ్ జోహార్. అయితే రాజమౌళితో సినిమా కోసం అతను ప్రయత్నిస్తున్నాడని.. అందుకే ఈ కామెంట్ చేశాడని అంటున్నారు జనాలు.