పవన్ తో కరణ్ జోహార్ ఇంపార్టెంట్ మీట్, బెజవాడలో ల్యాండ్ అవుతున్నాడు

బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా అంటే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు తమ హీరోలే హీరోలు వేరే భాషల హీరోలు జీరోలు అని కాలర్ ఎగరేసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా దమ్ము ఏంటీ అనేది పిచ్చ క్లారిటీ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2024 | 01:15 PMLast Updated on: Dec 23, 2024 | 1:15 PM

Karan Johars Important Meeting With Pawan

బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా అంటే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు తమ హీరోలే హీరోలు వేరే భాషల హీరోలు జీరోలు అని కాలర్ ఎగరేసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా దమ్ము ఏంటీ అనేది పిచ్చ క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా కరణ్ జోహార్ కు సౌత్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. అందుకే సౌత్ సినిమాల విషయంలో ఈ ప్రొడ్యూసర్ పెద్దగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా అప్పట్లో చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియన్ సినిమాలలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నాడు.

సినిమా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే ప్రొడ్యూసింగ్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు ఏకంగా వైజాగ్ లో ఒక స్టూడియో కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. వైజాగ్ లో స్టూడియో కట్టాలని ఎప్పటినుంచో కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నా అది వర్కౌట్ కావడం లేదు. వాస్తవానికి 2022లోనే దీనికి ఆలోచన చేసిన అది ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం స్టూడియో నిర్మాణం చేపట్టాలని తెలుగు సినిమా మొత్తం వైజాగ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఒపీనియన్ లో ఉన్నాడు.

అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు సినిమాకు మంచి ఆఫర్లు ఇవ్వడంతో కరణ్ జోహార్ కూడా అలెర్ట్ అవుతున్నాడు. అందుకే ఇప్పుడు వైజాగ్ లో ఒక స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నాడు ఈ బడా ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ తో అలాగే మెగా ఫ్యామిలీతో కరణ్ జోహార్ కు మంచి పరిచయాలు ఉన్నాయి. దీనితో ఆ పరిచయాలను వాడుకోవడానికి రెడీ రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలను ఫ్యూచర్లో నిర్మించడానికి బాలీవుడ్ ను కాస్త సైడ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్.

దాదాపు 150 నుంచి 200 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు బడ్జెట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే కొంతమంది తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కాంటాక్ట్స్ పెంచుకుంటున్న కరణ్ జోహార్ వైజాగ్ లో స్టూడియో నిర్మాణం తర్వాత కచ్చితంగా భారీ ప్లాన్ తో రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే హిందీలో రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ముందుకు వస్తున్నాడు. అందుకే భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల హిందీ రైట్స్ ను భారీగా ఖర్చుపెట్టి కొనేస్తున్నాడు. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో పెట్టుబడి పెట్టేందుకు కూడా బడా ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు.