Bhaje Vayu Speed Review : భజే వాయు స్పీడ్ రివ్యూ
ఆర్ఎక్స్ 100 (RX 100) తో యువ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ (Karthikeya). గత కొంతకాలంగా వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.

Karthikeya is the hero who has won the hearts of the young audience with RX 100.
ఆర్ఎక్స్ 100 (RX 100) తో యువ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ (Karthikeya). గత కొంతకాలంగా వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు. లేటెస్ట్ గా భజే వాయువేగం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా యు వి క్రియేషన్స్ లాంటి అగ్ర సంస్థ నిర్మించడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం..
కథ..
మధ్య తరగతి కుటుంబానికి చెందిన వెంకట్ చిన్నపటి నుంచి పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటాడు. అందుకు తగ్గ అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. అనుకోకుండా తండ్రి రాజయ్య అనారోగ్యం బారిన పడటంతో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. ఇంకో పక్క రౌడీ స్థాయి నుంచి హైదరాబాద్ నగరానికి మేయర్ అయిన జార్జ్ అతని తమ్ముడు డేవిడ్ లు వెంకట్ ని చంపటానికి తిరుగుతుంటారు. పైగా వెంకట్ మీద డ్రగ్స్ డీలర్ అనే ముద్రతో పాటు హత్య కేసు కూడా పడుతుంది. దీంతో వెంకట్ కోసం పోలీసులు వెతుకుతుంటారు. వెంకట్ కి జార్జ్, డేవిడ్ లకి సంబంధం ఏంటి డ్రగ్స్ కేసు మర్డర్ కేసు వెనుక ఉన్నకథ ఏంటి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు చివరకి తన తండ్రి ఆపరేషన్ చేయించాడా? అనేదే ఈ కథ
నటీనటులు పనితీరు..
కార్తికేయ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే పెద్దగా నటనకి అవకాశం లేకుండా పోయింది. సెంటిమెంట్ సీన్స్ లో బాగా చేసినా కూడా సబ్జెక్టు వీక్ గా ఉండటం వలన తేలిపోయింది. ఇక హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవాలిసిన పని లేదు. కార్తికేయ తమ్ముడు గా చేసిన రాహుల్ చక్కగానే చేసాడు. ఇక తనికెళ్ల భరణి రాజయ్య క్యారక్టర్ లో జీవించాడు. అలాంటి పెర్ ఫార్మ్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. విలన్ గా చేసిన రవిశంకర్ ది రొటీన్ నటనే. మేయర్ గా చేసిన శరత్ లోహితస్వ రూపంలో తెలుగు తెరకి ఇంకో చక్కని విలన్ దొరికాడు.
టెక్నికల్ టీం..
సాంకేతిక నిపుణల విషయానికి వస్తే ఆర్ ఆర్ బాగుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్స్ లో ఓపిగ్గా కుర్చున్నామంటే ఆయన వల్లే. ఇక దర్శకుడు విషయానికి వస్తే కొత్త దర్శకుడు ఎవరైనా ఒక వెరైటీ కథ తో తెరంగ్రేటం చేస్తాడు. కానీ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైన కథ తో వచ్చాడు. అతని టేకింగ్ బాగానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం రాంగ్ డైరెక్షన్ లో నడిచింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అంతంత మాత్రమే
ఫైనల్ గా చెప్పాలంటే మరోసారి కార్తికేయ ని కథ మోసం చేసింది. హీరో అంటే దర్శకుడికి సరిగా అర్ధం తెలియలేదు. 2024 లో ప్రేక్షకాదరణ కష్టమే.