Karthikeya : హనుమంతుడి సెంటిమెంట్ లో కార్తికేయ…

హనుమాన్‌ సినిమా వందలకోట్లు కలెక్ట్‌ చేయగానే హనుమంతులవారంటే అందరికీ విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఓకే.. మామ్మూలుగానే సెంటిమెంట్లు అపరిమితంగా ఉన్న సినిమా పరిశ్రమలో అందరు దేవుళ్లను అపారంగా పూజిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2024 | 02:30 PMLast Updated on: Apr 14, 2024 | 2:30 PM

Karthikeya With The Sentiment Of Hanuman

హనుమాన్‌ సినిమా వందలకోట్లు కలెక్ట్‌ చేయగానే హనుమంతులవారంటే అందరికీ విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఓకే.. మామ్మూలుగానే సెంటిమెంట్లు అపరిమితంగా ఉన్న సినిమా పరిశ్రమలో అందరు దేవుళ్లను అపారంగా పూజిస్తారు. దేవుడి మీదనే భారమంతా వేసి కోటానుకోట్ల గ్యాంబ్లింగ్‌ చేస్తుంటారు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడు ఏడాదికొకసారి తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చేసి వస్తుంటారు. ఇంకా అయ్యప్ప స్వామి దీక్షలకైతే కొదవే లేదు. ఎంత వ్యసనపరులైనా సరే అయ్యప్ప సీజన్‌ రాగానే వెంటనే మాల వేసుకుని పవిత్రమైపోతుంటారు. కానీ, ఈ మధ్య ఇండస్ట్రీలో హనుమంతులవారంటే తిరుగులేని నమ్మకం వచ్చేసింది. దీనికి కారణం హనుమాన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్‌ కావడం.

ఆది నుంచి ఆంజనేయస్వామి అంటే భక్తి ఉన్నా, హనుమాన్ విజయం అందరిలో హనుమంతుడి అండ ఉంటే భారీ విజయాలు సాధ్యమవుతాయి అనే గాఢమైన నమ్మకం నాటుకుపోయింది. నిజంగానే హనుమాన్ రిలీజ్‌కి ముందు సినిమాకి ధియేటర్లు దొరకలేదు. రిలీజ్‌ డేట్‌ మార్చుకోమని నిర్మాత నిరంజన్ రెడ్డి మీద దారుణమైన ఒత్తిడి వచ్చింది. కానీ, తమకి ఆంజనేయుడే అండ అని పబ్లిక్‌ స్టేట్‌‌మెంట్‌ ఇచ్చి అనుకున్న డేట్‌కి సినిమా రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. అనుకున్నదానికన్నా బడ్జెట్‌ ఎక్కువైనా కూడా మేకింగ్‌లో ఎక్కడా రాజీపడలేదు. కష్టానికి తగ్గట్టుగానే.. సినిమా విడుదలై భూకంపం సృష్టించింది. ప్రీమియర్లే విజృంభించాయి. దానికి తోడు మెగాస్టార్‌ చిరంజీవి హనుమాన్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి హాజరై హనుమంతులవారికి తనకీ ఉన్న అనుబంధం గురించి చెప్పడం, హనుమంతుడిని నమ్ముకుంటే విజయానికి తిరుగులేదని బల్లగుద్ది మరీ మాట్లాడటం.. ఇవన్నీ బాగా సెంట్‌మెంటుగా మారిపోయాయి.

కార్తికేయ హీరోగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి భజే వాయువేగం అని పేరుని ఖరారు చేశారు. కార్తికేయ కూడా హనుమంతుడి పేరే టైటిల్‌గా ఉండాలని ముచ్చటపడ్డాడుట. మొన్నటివరకూ ఏదోలా ఉన్న తేజా సజ్జా ఇప్పుడు నేషనల్‌ వైడ్‌ హీరో అయిపోయాడు. ఏకంగా అమిత్‌ షానే స్వయంగా పిలిచి అభినందించే రేంజ్‌కి వెళ్లిపోయాడు. ఇదంతా ఓ కలలా జరిగింది. అందుకే తను మాత్రం ఎందుకు అంత హిట్‌ కొట్టకూడదు, హనుమంతుడి అనుగ్రహం ఉంటే చాలు కదా అనే దృక్ఫథానికి వచ్చినట్టున్నాడు కార్తికేయ. ఈ మధ్యరోజుల్లో కార్తికేయకి కూడా చెప్పుకోదగ్గ హిట్‌ పడలేదు. భజే వాయువేగం సినిమా అయినా, హనుమంతుడి దయతో హిట్‌ అవుతుందేమో చూడాలి.