పుష్ప 2 లో కూడా కట్టప్ప… “దేవర” దారిలోనే ఐకాన్ బాహుబలి…

పుష్ప 2 షూటింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తే ఇక పేకప్ చెప్పేయటమే.. కేవలం జానీ మాస్టర్ తో ప్లాన్ చేసిన సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఈ వారంరోజుల్లో పూర్తి చేసేఛాన్స్ఉంది. జానీ మాస్టర్ ప్లేస్ లో మరో కొరియోగ్రాఫర్ తో రీ కంపోజ్ చేసిన సాంగ్ షూటింగ్ కి రంగం సిద్దమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 01:29 PMLast Updated on: Nov 05, 2024 | 1:29 PM

Kattappa Role In Pushpa 2

పుష్ప 2 షూటింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తే ఇక పేకప్ చెప్పేయటమే.. కేవలం జానీ మాస్టర్ తో ప్లాన్ చేసిన సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఈ వారంరోజుల్లో పూర్తి చేసేఛాన్స్ఉంది. జానీ మాస్టర్ ప్లేస్ లో మరో కొరియోగ్రాఫర్ తో రీ కంపోజ్ చేసిన సాంగ్ షూటింగ్ కి రంగం సిద్దమైంది.

ఇక ఈనెల మూడో వారం ట్రైలర్ లాంచ్ ని ప్లాన్ చేసిన పుష్ప 2 టీం, ఈ మండే నుంచి ప్రతీ మండే ఓ సాంగ్ ని, మేకింగ్ వీడియోని లాంచ్ చేయబోతోంది. అంతేకాదు ప్రతీ సండే హైద్రబాద్, బెంగలూరు, చెన్నై , ముంబై అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు

ఇలా పుష్ప2 ప్రమోషన్ ని పీక్స్ తీసుకెళ్లేందుకు సుకుమార్ టీం గట్టిగానే ప్లాన్ చేసింది.ఐతే పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 కి లీడ్ ని ప్లాన్ చేసిన సుకుమార్, అందుకు దేవర దారినే ఎంచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరలో వర్కవుట్ అయిన ఐడియానే, పుష్ప 2 క్లైమాక్స్ లో ప్లాన్ చేశారు. ఇది ఆల్ మోస్ట్ కన్పామ్ న్యూసే కాని, అఫీషియల్ గా ఇంకా రివీల్ చేయలేదు..

కత్తి పట్టిన శ్రీవల్లీ అంటూ ప్రచారం మొదలు కాగానే, దేవర దారిలో పుష్ 2 టీం వెళ్లిందనే మాట నిజమని తెలుస్తోంది. దేవర లో కట్టప్ప క్యారెక్టర్ ఉంది. కాని అది కట్టప్పో కాదో ఇప్పుడే చెప్పలేం.. బాహుబలిలో ఎలాగైతే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే ప్రశ్న బాహుబలి 2 విడుదలయ్యే వరకు అందరి మెదల్లనుతొలిచింది

అచ్చంగా దేవర క్లైమాక్స్ లో కూడా దేవరని, వరనే చంపేశాడా అనేలా సీన్ చూపించారు. అలాని వరనే కట్టప్ప అని చెప్పలేం. అసలు సమాధానం దేవర సీక్వెల్ లోనే చూపించే ఛాన్స్ ఉంది. అచ్చంగా అలానే పుష్ప 2 క్లైమాక్స్ ని పెడుతున్నారట.

అంటే బాహుబలి క్లైమాక్స్ లో కట్టప్ప కత్తిపోటు లాంటిదే కాని, వెన్నుపోటు కాదు… ఇదే దేవర క్లైమాక్స్ ని కొత్తగా మార్చిన అంశం.. కట్టప్ప బాహుబలికి వెన్నుపోటు పొడిచాడు.. ఎందుకుపొడిచాడనేది బాహుబలి 2లో చెప్పారు. కాని దేవర క్లైమాక్స్ అలాకాదు.. అది వెన్నుపోటో కాదో ఇంకా తేలలేదు.. అదే చాలా మందికి నచ్చింది…అందుకే పుష్ప 2 టీం కూడా ఆ ఐడియానే ఫాలో అవుతోంది. శ్రీవల్లి ఇందులో పుష్ప కడుపులో కత్తిదించుతుందా, తీస్తుందా తేలకుండా పార్ట్ 3 కి లీడ్ ని క్రియేట్ చేశారట. ఇది సెట్లోంచి బయటకి లీకైంది.. ఎంత సీక్రెట్ గా ఉంచాలనుకున్నా, పుష్ప 2 క్లైమాక్స్ మరో దేవరా అన్నట్టు ప్రచారం మాత్రం మొదలైంది…