KCR రివ్యూ: బలగంను గుర్తు చేస్తున్న కేసీఆర్..
కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) ఇప్పుడు తెలంగాణాలో ఓ సైలెంట్ సెన్సేషన్. రాజకీయ నాయకుల పేరుతో సినిమా వాళ్ళు ఓ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గేట్స్ తో జబర్దస్త్ లో ఫేమస్ అయిన రాకింగ్ రాకేశ్... తన అభిమాన నాయకుడు కేసీఆర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు.
కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) ఇప్పుడు తెలంగాణాలో ఓ సైలెంట్ సెన్సేషన్. రాజకీయ నాయకుల పేరుతో సినిమా వాళ్ళు ఓ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గేట్స్ తో జబర్దస్త్ లో ఫేమస్ అయిన రాకింగ్ రాకేశ్… తన అభిమాన నాయకుడు కేసీఆర్ పేరుతో సినిమా తెరకెక్కించాడు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా రాకేశ్ ఈ సినిమాను ధైర్యంగా రిలీజ్ చేయడం చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఫిదా అయిపోయారు. కెరీర్ స్టార్టింగ్ లో అతను వేసిన ఈ స్టెప్ కు షాక్ అయ్యారు. ఈ సినిమా ప్రకటన వెలువడిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది.
ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో సినిమా కోసం బాగా ఎదురు చూసారు. కేసీఆర్ ఆభిమాని కథగా సినిమా తీశానని రాకింగ్ రాకేష్ ప్రమోషన్స్ లో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆయన పేరొక్కటి చాలు సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి అని ధీమాగా ప్రమోషన్స్ చేసాడు. మరి ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగబాయి తండాలో నివాసం ఉండే యువకుడు కేశవచంద్ర రమావత్ చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం ఓ స్థాయిలో ఉండేది. ఆ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనకు విపరీతమైన అభిమానిగా మారిపోతాడు. కేసీఆర్ లా ఆ ఊరిలో అందరి నోళ్ళల్లో నానుతూ ఉంటాడు. చోటా కేసీఆర్ అని పిలుస్తూ ఉంటారు అక్కడి జనం. ఇక తనది పేద గిరిజన కుటుంబం కావడంతో… కుటుంబానికి తానే దిక్కు అవుతాడు. తన కుటుంబం ఎలా అయినా పైకి రావాలని పట్టుదలగా కష్టపడుతూ ఉంటాడు.
ఆ సమయంలో అతని మరదలు మంజు అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటారు పెద్దలు. కాని కెరీర్ పై ఫోకస్ చేసిన అతను… పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది అని ఫ్రెండ్స్ చెప్పడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు. ఈ విషయం తెలిసిన అతని మామ భీమ్లానాయక్ ఆగ్రహానికి గురై ఇబ్బంది పడతాడు. ఇదే సమయంలో… ఆ తండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురుతో కేశవ చంద్ర సంబంధం సెట్ అవుతుంది. ఇక కేసీఆర్ పై అభిమానం ఉన్న కేశవ… కేసీఆర్ సంక్షంలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి హైదరాబాద్ వెళ్తాడు.
అక్కడి నుంచి అతని జీవితం ఎలా మారుతుంది… ఓ రింగ్ రోడ్డు తన ఊరిని ఎలా ఇబ్బంది పెడుతుంది… ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తాడు అనేదే సినిమా. సినిమా గురించి మాట్లాడే ముందు… టేకింగ్ గురించి మాట్లాడాలి. రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ అని చెప్పవచ్చు అంటున్నారు ఆడియన్స్. ప్రముఖ రచయుత గోరటి వెంకన్న రాసిన ‘పదగతులు స్వరజతులు పల్లవించిన నేల’ అనే పాటతో సినిమాను మొదలుపెట్టడమే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు ఆడియన్స్. ఇదే పాటలో పచ్చటి పైరుని సింగారించుకున్న తెలంగాణ పటం పై కేసీఆర్ నడచి వచ్చే ఓ సీన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసాడు కేశవ చంద్ర.
చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల కోసం ఓ రకంగా పిచ్చోడు అయిపోవడం… టీఆర్ఎస్ జెండా పట్టుకొని ఊరి వీధుల్లో ఊరేగే సీన్స్ చూస్తే ఉద్యమ రోజులు కళ్ళ ముందు కనపడతాయి. సినిమాలో కేసీఆర్ అభిమానిగా మారే విధానం చాలా బాగా చూపించారు. కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభను కూడా బాగా వాడుకున్నారు. అదే టైం లో తెలంగాణా రావడం, అతను పెద్దవాడు కావడం… సొంత రాష్ట్రంలో తన ఊరు మారడం అన్నీ కూడా దర్శకుడు చాలా కన్విన్సింగ్గా చూపించాడు. ఎక్కడా బోరింగ్ ఫీల్ ఉండదు. సినిమాలో ఎమోషన్స్ చూసిన వాళ్ళు… మరో బలగం సినిమా అంటూ కొనియాడుతున్నారు. రింగ్ రోడ్డు కారణంగా ఊరును కాళీ చేయాల్సి రావడం, అదే టైం లో మరదలు మంజుతో పెళ్లి రిజెక్ట్ చేస్తాడు.
అక్కడి నుంచి సినిమా ఎమోషనల్ రూట్ లోకి వెళ్తుంది. మామ భీమ్లా నాయక్… కేశవా పై కోపం తో చేసే పనులు… ఆడియన్స్ ను ఎమోషనల్ చేస్తాయి. సెకండాఫ్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసారు. హైదరాబాద్ లో అతను పడిన కష్టాలను చాలా ఎమోషనల్ గా చూపించారు. కేసీఆర్ పై అభిమానం, ఆయనను ఎవరైనా ఏమైనా అంటే ఎదురు తిరగడం… తెలంగాణా రాష్ట్రానికి ఎదురైన అవమానాలు… 60 ఏళ్ళ పరాయి పాలనలో పడిన కష్టాలను చాలా బాగా చూపించారు. కొన్ని డైలాగ్స్ కు ఆడియన్స్ కు గుడ్ బంప్స్ వచ్చాయి. ‘ఒకప్పుడు చరిత్ర మరచిన తెలంగాణ ఇప్పుడు చరిత్రనే మార్చింది..’ అనే డైలాగ్ సినిమాకు హైలైట్. ‘ఊరిని వదిలి పెట్టే మనుషులు ఉంటారు కానీ..మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు’ వంటి డైలాగ్ లు హార్ట్ టచింగ్ గా అనిపించాయి. దర్శకుడు అంజీ పని తీరు చూసిన ఆడియన్స్… మంచి ఫ్యూచర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాకింగ్ రాకేశ్ నటన సినిమాకే హైలెట్. జబర్దస్త్ నటుడు అయినా… ప్రొఫెషనల్ యాక్టర్ గా దుమ్ము రేపాడు. సినిమాకు అతనే హైలెట్. ఇతర నటులు… టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది.