కీర్తి సురేష్ గుడ్ న్యూస్.. ఓహో సూపర్ ఫాస్ట్.. పెళ్లైన మూడు నెలలకే శుభవార్త..!
గత మూడు నెలల నుంచి వేరే ప్రపంచంలో ఉంది కీర్తి సురేష్. తన చిన్ననాటి స్నేహితుడు, లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

గత మూడు నెలల నుంచి వేరే ప్రపంచంలో ఉంది కీర్తి సురేష్. తన చిన్ననాటి స్నేహితుడు, లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్త ఆంటోనితో కలిసి స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తుంది కీర్తి సురేష్. పెళ్లి తర్వాత సినిమాలకు కూడా దూరంగానే ఉంది.. అలాగని పూర్తిగా దూరం అవుతుందని కాదు ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది ఈ కేరళ కుట్టి. సినిమాలు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ పెళ్లి తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇదే కదా సరైన టైమ్ అంటుంది కీర్తి. అందుకే ఒప్పుకున్న సినిమాలు కూడా పెళ్లికి ముందే పూర్తి చేసింది.. ఇంకా చెప్పాలంటే సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు కీర్తి, ఆంటోనీ. మ్యారేజ్ తర్వాత కొన్ని నెలల పాటు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు కీర్తి సురేష్ కపుల్. వెకేషన్స్ వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడి.
ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న వార్త అది. ఆమె పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ చెప్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చివరికి ఆ వార్త చెప్పింది కీర్తి సురేష్. మీరు అనుకున్న గుడ్ న్యూస్ అయితే అది కాదు.. ఆమె చెప్పిన న్యూస్ వేరే..! మామూలుగా పెళ్లి తర్వాత గుడ్ న్యూస్ అంటే అందరి ఫోకస్ ఒక దాని మీదే ఉంటుంది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ చెప్పిన గుడ్ న్యూస్ మాత్రం మళ్లీ ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయడమే. పెళ్లి తర్వాత మొదటి సినిమా మలయాళం లోనే సైన్ చేసింది ఈ బ్యూటీ. తన ఫ్రెండ్ టొవినో థామస్ హీరోగా సినిమా చేయబోతుంది కీర్తి. గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన వాశీ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారు వీళ్లిద్దరు.
కీర్తి సురేష్ మళ్లీ సినిమా ఓకే చేయడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకుంటారు అని చెప్తే ఎన్నేళ్లు తీసుకుంటుందో అని అనుకున్నారంతా. కానీ మూడు నెలల గ్యాప్ లోనే కొత్త సినిమా ఓకే చేయడంతో హనీమూన్ పీరియడ్ అయిపోయింది అని అర్థమవుతుంది. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను అంటుంది కీర్తి సురేష్. తెలుగులో కూడా మంచి కథలు వస్తే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటుంది. ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచిన కీర్తి.. అవసరమైతే అలాంటి క్యారెక్టర్స్ కూడా చేస్తాను ఉంటుంది. ఇక కీర్తి 2.0ను దృష్టిలో పెట్టుకొని దర్శకులు కథలు రాయడమే తరువాయి. అన్నట్టు ఈమె వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ఇప్పటికే అక్క అనే సిరీస్ నెట్ ఫ్లిక్స్ కోసం చేసింది కీర్తి సురేష్. త్వరలోనే అది స్ట్రీమింగ్ కు రానుంది. ఏదేమైనా పెళ్లి తర్వాత తక్కువ గ్యాప్ లోనే మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది కీర్తి. ఇది అభిమానులకు గుడ్ న్యూసే కదా.