Keerthi Suresh : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్
అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే కీర్తి సురేష్ మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు.

Keerthy Suresh in MS Subbulakshmi biopic
అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే కీర్తి సురేష్ మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు. అందంగా ఉండటమే కాదు నటనని కూడా అంతే అందంగా మలుచుకోగలదు.ఇప్పుడంటే తనకి సినీ కాలం కలిసి రావడం లేదు గాని ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఎంతో మంది యువకుల కళల రాణి కూడా..తాజాగా ఆమె కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది
ఎంఎస్ సుబ్బులక్ష్మి కర్ణాటక ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంలో అగ్రగణ్యురాలు. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు, అభంగాలు, దేశభక్తి గీతాలని ఆలపించారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో ఆలపించడం ఆమె ప్రత్యేకత.ప్రపంచ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి లో పాడిన రికార్డు కూడా ఆమె సొంతం. ఇప్పుడు ఆమె బయోపిక్ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి ఇందులో సుబ్బులక్ష్మి గారి పాత్రని కీర్తి సురేష్ పోషించబోతుందని ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. అదే కనుక జరిగితే కర్ణాటక సంగీతానికి పాటకి అమరత్వం తెచ్చిన ఒక మహా శిఖామణి గురించి ఈ తరానికి తెలియచేసినట్టు అవుతుంది. ఒక తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం
ప్రెజంట్ కీర్తి చేతిలో ఎక్కువ సినిమాలు లేవు.దీంతో అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ కి కూడా సిద్దమనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీకి ఒకే చెప్పిందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తుంది.ఇలాంటి టైం లో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో ఆమె నటిస్తే ఇక ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం