Keerthi Suresh: కీర్తి సురేష్ చెల్లెలు గా చేస్తే బొమ్మ ఢమాల్.. ఇండస్ట్రీ లో ఇదే టాక్ ఇప్పుడు
కీర్తి సురేష్ సెంటిమెంట్ బడా స్టార్స్ కి షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారింది.
మనుషులన్నాక ఎవరికైనా సెంటిమెంట్స్ ఉంటాయి. సినీ పరిశ్రమలో ఇవి చాలా ఎక్కువ. ప్రాజెక్ట్ లాంఛ్ నుంచి రిలీజ్ వరకు ప్రతీదీ సెంటిమెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. హీరోలు ,హీరోయిన్స్ కూడా వాటిని తప్పకుండా ఫాలో అవుతారు.అయితే తాజాగా బ్యూటీ సిస్టర్ కీర్తి సురేష్ సెంటిమెంట్ బడా స్టార్స్ కి షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారింది.
కీర్తి సురేష్..నేను శైలజ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన బ్యూటీ. నాగ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి చేస్తే.. నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది .కానీ తర్వాత తొందర పడి లేడీ ఓరియోండెట్ సినిమాలు చేస్తే చేతులుకాలాయి.అందుకే మహేష్ సర్కారు వారి పాటలో గ్లామర్ డాల్ గా నటించి తనేంటో నిరూపించుకుంది. దసరాలో వెన్నెల పాత్ర చేసి సత్తా చాటింది.కెరీర్ ఫుల్ ఫాం లో ఉన్నప్పుడు స్టిస్టర్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అక్కడే దెబ్బ పడింది.
జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ..గత సినిమా అన్నాత్తే తో ఘోరమైన ఫెయిల్యూర్ ని చూశారు. ఇందులో రజనీకి చెల్లిగా కీర్తి సురేష్ నటించింది.తాజాగా రిలీజైన భోళా శంకర్ లో మెగాస్టార్ కి సిస్టర్ గా చేసింది కీర్తిసురేష్. వేళా విశేషం ఏంటో గానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఊహించని రీతిలో నష్టాలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. భోళా శంకర్ డిజాస్టర్ కి రకరకాల కారణాలు ఉన్నా కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఓ రీజన్ అంటున్నారు క్రిటిక్స్.
మొత్తానికి చిరు,రజనీ లాంటి ఇద్దరు బడా స్టార్స్ కి చెల్లిగా యాక్ట్ చేసి అనుకోని ప్లాప్స్ ని నెత్తిమీద వేస్తుకుంది కీర్తి సురేష్. దీంతో ఈ బ్యూటీ స్టార్ హీరోలకు చెల్లెలుగా నటిస్తే సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం గ్యారెంటీ అనే కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. కీర్తి సురేష్ టాలెంట్ ఏంటో మహానటితో ఫ్రూవ్ అయింది. అలాంటి టఫ్ పాత్రలు..డిఫరెంట్ కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు కీర్తి ఫ్యాన్స్. రొటీన్ కథలకు ముఖ్యంగా సిస్టర్ రోల్స్ కి బ్రేక్ ఇవ్వలని చెబుతున్నారు.ప్రజెంట్ ఇదే విషయాన్ని క్యాచ్ చేసిన కీర్తి.. కోలీవుడ్ ,మల్లూవుడ్ లో 3,4 సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
వరుణ్ ధావన్ హీరోగా కలీస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ ద్వారా హిందీలో హీరోయిన్ గా పరిచయం కానుంది.మొత్తానికి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టం పరిక్షించుకోబోతోంది. నువ్వు నాకు ఫ్యూచర్ లో చెల్లెలివి కావు అని చిరంజీవి యె టైమ్ లో అన్నాడోకానీ.. ఇక కీర్తి బహుశా ఎవరికి చెల్లెలుగా చేయలేక పోవచ్చు. సిస్టర్ రోల్ చేసిన బొమ్మ ఢమాలే అంటున్నారు నెటిజన్స్.