రష్మికను ఇరికించిన కేతిరెడ్డి.. నేషనల్ క్రష్ గురించే తొక్కిసలాట, వాడ్ని ఎవడు చూస్తాడు..?
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమా రిలీజ్ కారణంగా అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడం అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు రావడం దీనితో తొక్కిసలాట.. ఘటన జరగడం ఆ తర్వాత అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వంటివి జరిగాయి. ఈ ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సినీ పరిశ్రమకు మధ్య దూరం బాగా పెరిగింది.
ఆ తర్వాత నుంచే బెనిఫిట్ షోలను రద్దు చేయడం.. అలాగే టికెట్ ధరల పెంపు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం వంటివి జరిగాయి. వాటన్నిటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడాన్ని సినిమా అభిమానులు అలాగే సినిమా పరిశ్రమ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనను పెద్ద ఎత్తున సినిమా పరిశ్రమ పెద్దలు పరామర్శించారు. ఇక ఈ ఘటన తర్వాత రాజకీయంగా కూడా దుమారం రేగింది.
ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ముఖ్యంగా కేటీఆర్.. రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకునే క్రమంలో అల్లు అర్జున్ ను ఇరికించే విధంగా కామెంట్ చేశారు. ఇక ఈ విషయంలో వైసీపీ కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడింది. 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత నుంచి జనసేన పార్టీకి అలాగే మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరం జరిగినట్లు అర్ధమైంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుంటే అల్లు అర్జున్ ప్రచారం చేయకపోవడాన్ని మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేదు. ఇక వైసిపి అయితే పుష్ప సినిమా విషయంలో కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇక తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పులేదని ఈ ఘటనలో మొత్తం రష్మికాదే తప్పు అంటూ ఆయన కామెంట్ చేశారు. రష్మికాను చూడటానికే అంత పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని ఆమె నేషనల్.. క్రష్ అంటూ ఆయన కామెంట్ చేశారు. అల్లు అర్జున్ చూడటానికి ఏమాత్రం బాగాలేదని గడ్డం పెంచుకొని లుక్ కూడా సరిగ్గా లేదని అందుకే రష్మిక మందనాని చూడటానికి అంత పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని ఈ ఘటన జరగడానికి కారణం రష్మిక అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.