kgf actor-allu-arjun : అల్లు అర్జున్ పై కేజిఎఫ్ నటుడి కీలక వ్యాఖ్యలు..ఫ్యాన్స్ రియాక్షన్ మాములుగా లేదు
అల్లు అర్జున్ (Allu Arjun)... తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో, డాన్సులతో కొన్ని లక్షల మంది అభిమానులని తన వశం చేసుకున్నాడు.

KGF actor's key comments on Allu Arjun..Fans reaction is not normal
అల్లు అర్జున్ (Allu Arjun)… తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో, డాన్సులతో కొన్ని లక్షల మంది అభిమానులని తన వశం చేసుకున్నాడు. బన్నీ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతర మొదలవుతుంది. సినిమా సినిమాకి సరికొత్త స్టైల్ ని పరిచయం చేస్తు అందరు దాన్ని ఫాలో అయ్యేలా చెయ్యడంలో కూడా స్పెషల్. తాజాగా బన్నీ మీద ఒక నటుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాన్ ఇండియా (Pan India) ప్రేక్షకులు కేజిఎఫ్ (KGF) ని మర్చిపోవడం అనేది ఇప్పట్లో జరగని పని. ఆ మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు తారక్ పొన్నప్ప. దయ క్యారక్టర్ లో సూపర్ గా నటించాడు. ఇప్పుడు పుష్ప 2 (Pushpa 2) లో కూడా చేస్తున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పాడు. బన్నీ తో నాకు పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. నాకేమో వాటిల్లో అనుభవం లేదు. ఈ క్రమంలో ఫైట్స్ చేసేటప్పుడు స్క్రీన్ పై ఏ విధంగా కనపడాలో చెప్పాడు. బాడీ పొజిషన్స్ కూడా ఎలా ఉండాలో సజిషన్ ఇచ్చాడు.
అలాగే డాన్స్ ఫైట్స్ ల్లో బన్నీ కి ఉన్న అద్భుతమైన పరిజ్ఞానం చూసి ఆశ్చర్యం వేసింది. రియల్లీ బన్నీ చాలా గొప్ప నటుడు అనే కితాబుని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు బన్నీ ఫ్యాన్స్ లో జోష్ ని తెచ్చాయి.ఇక పాన్ ఇండియా మొత్తం ఎదురుచూసే సినిమాల్లో పుష్ప 2 కూడా ఒకటి. పార్ట్ 1 లో అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే.. 2 లో అంతకు మించి ఉంటుందని మేకర్స్ చెప్తు వస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఉంది. అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. పార్ట్ 1 లో ఉన్న ఆర్టిస్ట్ లంతా దాదాపుగా 2 లోను ఉన్నారు. రష్మిక మరో సారి శ్రీవల్లిగా విజృంభించనుంది.