KGF-3: రాకీ భాయ్ వస్తున్నాడు.. కేజీఎఫ్-3 కన్ఫాం.. అధికారికంగా ప్రకటించిన హోంబలే ఫిలింస్

త్వరలోనే కేజీఎఫ్-3 కూడా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిలింస్. కేజీఎఫ్-2 రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది హోంబలే నిర్మాణ సంస్థ. ఈ వీడియోలోనే ఎండ్‌లో కేజీఎఫ్-3 గురించి అప్‌డేట్‌ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2023 | 01:20 PMLast Updated on: Apr 14, 2023 | 1:20 PM

Kgf Chapter 3 Confirmed With New Video As Kgf 2 Clocks One Year Hombale Films Hint At Storyline

KGF-3: రాకింగ్‌స్టార్‌ యష్‌ ఫ్యాన్స్‌కు, కేజీఎఫ్‌ సినిమా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది హోంబలే ఫిలింస్. త్వరలోనే కేజీఎఫ్-3 కూడా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది. కేజీఎఫ్-2 రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది హోంబలే నిర్మాణ సంస్థ. ఈ వీడియోలోనే ఎండ్‌లో కేజీఎఫ్-3 గురించి అప్‌డేట్‌ ఇచ్చింది. 1978 నుంచి 1981 వరకూ రాఖీ ఎక్కడున్నాడు? అతను తన తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చాడా అనే లైన్‌తో కేజీఎఫ్-3 రాబోతోందని ప్రకటించింది.

కేజీఎఫ్ ఫ్యాన్స్‌ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్-3ని రూపొందిస్తారట. ఫస్ట్‌ వచ్చిన రెండు పార్ట్స్‌ కంటే కూడా కేజీఎఫ్-3 వేరే లెవెల్‌లో ఉండబోతోందని తెలిపింది హోంబేల్‌ ఫిల్మ్స్‌. నిజానికి కేజీఎఫ్-2 మూవీ ఎండింగ్‌లోనే కేజీఎఫ్-3 గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. కేజీఎఫ్ చాప్టర్‌ 3 పుస్తకాన్ని చూపించి సినిమాను ముగించారు. కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియదు. ఇటీవల కేజీఎప్‌ నటి రవీనా టాండన్ కూడా కేజీఎఫ్-3 గురించి లీక్‌ ఇచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని చెప్పింది. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేసే చాన్స్‌ ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌, ఎన్టీఆర్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు యష్‌ కూడా ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్‌ సైన్‌ చేశాడు.

దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లి సినిమా రావాలంటే 2025 వరకూ వెయిట్‌ చేయాల్సిందే. దీంతో కేజీఎఫ్-3 2025లోనే స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్-1 రిలీజైన తరువాత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్‌ నైట్‌లో యష్‌ను పాన్‌ ఇండియా హీరోను చేసింది. దీంతో కేజీఎఫ్-2 మీద ఫ్యాన్స్‌ అంచనాలు పెరిగిపోయాయి. కానీ కేజీఎఫ్-1ను తలదన్నేలా కేజీఎఫ్-2 తీశాడు ప్రశాంత్‌ నీల్‌. ఈ రేంజ్‌లో ఏ హీరోను ఏ డైరెక్టర్‌ ఎలివేట్ చేయలేడు అన్న రేంజ్‌లో యష్‌ను చూపించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ డాన్‌గా కేజీఎఫ్-3లో యష్‌ను ఏ రేంజ్‌లో ఎలివేట్‌ చేస్తాడో చూడాలి మరి.