Yesh: మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా యష్‌..కేజీఎఫ్‌ను బీట్‌ చేస్తారా..

ఒకే ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు హీరో యష్‌. గతంలో ఎన్ని సినిమాలు తీసినా.. కేజీఎఫ్‌ సినిమా యష్‌ ఇండియా శిఖరాగ్రాన నిలబెట్టింది. సింగిల్‌ నైట్‌లో యష్‌ మార్కెట్‌ను మార్చి పడేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 18, 2023 | 12:24 PMLast Updated on: Jun 18, 2023 | 12:24 PM

Kgf Hero Yesh Movie With National Award Wining Director Neethu Mohan Das

ఇప్పుడు ఇండియాలో యష్‌ను గుర్తుపట్టని సినీ ప్రియులు దాదాపు ఉండరు. ఇంత స్టార్‌డం వచ్చిన తరువాత కథలు ఎంచుకోవడం అంటే నిజంగా చాలా పెద్ద టాస్క్‌. ఏమాత్రం మిస్టేక్‌ జరిగినా ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుంది. అందుకే కేజీఎఫ్‌-2 తరువాత ఇప్పటి వరకూ సినిమా ఎనౌన్స్‌ చేయలేదు యష్‌. దాదాపు సంవత్సరం నుంచి కథలు వింటూనే ఉన్నాడు. కానీ ఏదీ ఫైనల్‌ చేయలేదు. అయితే రీసెంట్‌గా మళయాలి లేడీ డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌ చెప్పిన కథ యష్‌కు బాగా నచ్చిందట. స్టోరీ విన్న వింటనే ఓకే చెప్పేశాడని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతోందని టాక్‌ నడుస్తోంది.

ఇక్కడ హైలెట్‌ పాయింట్‌ ఏంటంటే.. ఈ కథ కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోందట. ఇప్పటికే యష్‌ మాఫియా డాన్‌గా వచ్చిన కేజీఎఫ్‌ సినిమా ఇండియన్‌ సినిమా రికార్డ్స్‌ను తిరగరాసింది. కొత్త చరిత్ర సృష్టించింది. యష్‌ కటౌట్‌కు మాస్‌ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అలాంటి యష్‌ మరోసారి మాఫియా డాన్‌గా కనిపించబోతున్నాడు అంటే ఈ సినిమా మీద అప్పడే తెగ హైప్‌ క్రియేట్‌ ఐపోయింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాను ఇంకా అఫీషియల్‌ ఎనౌన్స్‌ చేయలేదు. నిజంగానే ప్రాజెక్ట్‌ సెట్స్‌ మీదకు వెళ్తే.. గీతూ మోహన్‌ దాస్‌ యష్‌ను ప్రశాంత్‌ నీల్‌ కంటే గ్రాండ్‌గా ఎలివేట్‌ చేస్తుందో లేదో చూడాలి.