కెజిఎఫ్ లో వేలు పెట్టి ఖతం అయిపోయిన కబ్జా.. తీసిన సినిమా మళ్ళీ తీస్తే ఇలాగే ఉంటుంది
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెత కబ్జా సినిమాకు సరిగ్గా సరిపోతుంది. కన్నడ ఇండస్ట్రీకి పేరుతోపాటు.. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా కెజిఎఫ్. ఇదే మేకింగ్‌ను దించేస్తే డిజాస్టర్ అవుతుంది. ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా పరిస్తితి ఇలాగే వుంది. కెజిఎఫ్‌ను కాపీ కొట్టి బాక్సాపీస్‌ను కబ్జా చేయాలనుకుంటే.. అడ్డంగా దొరికిపోయింది.
బాహుబలిని చూసి మరో బాహుబలి లాంటి సినిమా తీయాలనుకోవడం ఎంత తప్పో.. కెజిఎఫ్‌ను టచ్ చేయడం కూడా అంతే తప్పు. ఇండస్ట్రీలో అదొక మార్క్‌గా నిలిచిపోయింది. మళ్లీ కెజిఎఫ్ తీయడానికి ప్రశాంత్ నీల్… నటించడానికి యశ్ వున్నారు. ఈ కాంబోలో కెజిఎఫ్3ను కూడా ఎనౌన్స్ చేశారు. ఉపేంద్ర, సుదీప్.. శివరాజ్ కుమార్ నటించిన కన్నడ మూవీ కబ్జా చూస్తుంటే.. కెజిఎప్‌నే మళ్లీ తీసినట్టనిపించి.. ఆడియన్స్ రిజక్ట్ చేసి పారేశారు.
మొదటి ఆట పడిందో లేదో.. కబ్జా ఫ్లాప్ అంటూ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. మొదటి రోజే కలెక్షన్స్ పడిపోయాయి. కానీ.. రెండు రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ ప్రచారం చేయడంతో.. ఇదొక ఫేక్ పబ్లిసిటీ అని జనాలకు అర్థమైపోయింది. సినిమా ఇప్పటివరకు 27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే.. 100 కోట్లని వేసుకోవడంతో.. ట్రోలర్స్ కబ్జా టీంను ఆడుకున్నారు. సూపర్‌హిట్ మూవీనే మళ్లీ తీసి చేతులు కాల్చుకున్న సినిమాలు చాలా వున్నాయి.
తెలుగు సినిమా చరిత్రలో మగధీర సన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే ఛాయలున్న పునర్జన్మ కాన్సెప్ట్ మూవీ శక్తిలో నటించిన ఎన్టీఆర్‌కు చుక్కెదురైంది. మెహర్ రమేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో నిర్మాత అశ్వనీదత్ కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. ఇక పూరీ జగన్నాథ్ అయితే.. తీసిన సినిమానే తీసి ఫ్లాప్ చూశాడు. పూరీ కెరీర్‌లో చాలా హిట్స్ వున్నా.. దర్శకుడి పేరు చెప్పగానే.. ఎక్కువమందికి పోకిరి గుర్తుకొస్తుంది. మహేశ్‌బాబుకు అదిరిపోయే స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఇదే కథను అటు ఇటు మార్చి బాలయ్యతో ‘పైసా వసూల్’ తీస్తే.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు లేవు.ఇందుమూలంగా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే.. తీసిన సినిమా మళ్ళీ తీస్తే నష్టం తప్ప ఇంకేం ఉండదు.