Salaar 2: కొత్త జోష్.. ‘సలార్ 2’లో క్రేజీ బ్యూటీ 

కల్కి సినిమా రిలీజ్ అయిపోగానే.. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. మరో కొత్త హీరోయిన్ ఖాన్సార్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ వైరల్‌ అవుతోంది. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 05:10 PMLast Updated on: Apr 24, 2024 | 5:10 PM

Kiara Advani Will Be Seen In Prabhas Salaar 2
Salaar 2:  ప్రభాస్ కమిట్ అయిన అప్ కమింగ్ ఫిల్మ్స్‌లో సలార్ 2.. శౌర్యాంగ పర్వం పై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కల్కి సినిమా రిలీజ్ అయిపోగానే.. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో.. మరో కొత్త హీరోయిన్ ఖాన్సార్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ వైరల్‌ అవుతోంది. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 ఫస్టాఫ్ అంతా శృతి క్యారెక్టర్ చుట్టే కథ నడుస్తుంది. కానీ ప్రభాస్‌తో రొమాన్స్ సీన్స్ పడలేదు. దీంతో శౌర్యాంగ పర్వంలో మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హాట్ బ్యూటీ దాదాపుగా ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం కియారా అద్వానీ, రామ్ చరణ్ సరసన ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ప్రభాస్‌తో ఛాన్స్ అంటే.. అమ్మడికి బంపరాఫర్ అనే చెప్పాలి. ఇకపోతే.. సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్‌లో వదిలేసిన డౌట్స్ అన్నింటికి.. పార్ట్ 2తో సాలిడ్ ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా 700 కోట్లు రాబడితే.. సలార్ 2 వెయ్యి కోట్ల టార్గెట్‌తో రాబోతోంది. మరి ఈసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే బాక్సాఫీస్ దాడి ఎలా ఉంటుందో చూడాలి.