20 కోట్ల సినిమా.. కనీసం 2 కోట్లు కూడా వచ్చేలా లేవుగా.. డిజాస్టర్ కా బాప్..!

మా సినిమా బాగుంటుంది అని చెప్పడం కాన్ఫిడెన్స్.. మా సినిమానే బాగుంటుంది అని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్. మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కడ ఒక దగ్గర బోల్తా పడక తప్పదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2025 | 03:30 PMLast Updated on: Mar 18, 2025 | 3:30 PM

Kiran Abbavaram Movie Digester

మా సినిమా బాగుంటుంది అని చెప్పడం కాన్ఫిడెన్స్.. మా సినిమానే బాగుంటుంది అని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్. మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కడ ఒక దగ్గర బోల్తా పడక తప్పదు. కిరణ్ అబ్బవరం విషయంలో ప్రతిసారి ఇదే జరుగుతుంది. మనోడు ప్రతి సినిమా చేసినప్పుడు నా సినిమా అదిరిపోతుంది చూడండి అంటాడు..! ఈయన నమ్మకం ‘క’ సినిమా విషయంలో వర్కౌట్ అయింది. కెరీర్ లో ఫస్ట్ టైం ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కిరణ్. ఆ సినిమా హిట్ కావడంతో కెరీర్ బాగా ప్లాన్ చేసుకుందామని ఎన్నో కలలు కన్నాడు. టైం తీసుకుని మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ కొడతానని మాట ఇచ్చాడు. అయితే హిట్ వచ్చిన మత్తులో మళ్లీ రొటీన్ సినిమాకు ఓకే చెప్పేసాడు. తాజాగా ఈయన నటించిన దిల్ రూబా సినిమా కనీసం రెండు రోజులు కూడా థియేటర్లో ఆడలేదు. నిజం చెప్పాలంటే క కంటే దిల్ రూబా కిరణ్ అబ్బవరం కెరీర్ కు కీలకమైన సినిమా.

ఎందుకంటే హిట్లలో లేనప్పుడు ఆ హీరో సినిమా వస్తుందా లేదా అని ఎవరు అడగరు.. ఎలా ఉంది అనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత దాన్ని మైంటైన్ చేయడం చాలా కష్టం. అదే ఊపులో ఇంకొక హిట్ సినిమా గానీ పడింది అంటే మార్కెట్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత కాస్త ప్లాన్ చేసుకుంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇదే సమయంలో ఒక ఫ్లాప్ కానీ పడింది అంటే మాత్రం మందు వచ్చిన బ్లాక్ బస్టర్ కూడా మరిచిపోతారు మన ఆడియన్స్. మళ్లీ మొదటి నుంచి లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా కిరణ్ అబ్బవరం విషయంలో ఇదే జరుగుతుంది. క ఇచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు కిరణ్. ఎప్పుడో మిలీనియం నాటి కథను తీసుకొచ్చి ఇప్పుడు ప్రేక్షకుల మీదకు రుద్దే ప్రయత్నం చేశాడు. దాంతో దిల్ రూబా వచ్చిన విషయం కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆడియన్స్. మొదటి రోజు ఈ సినిమాకు కేవలం 50 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. రెండో రోజు అది కూడా కనిపించడం లేదు. మూడో రోజుకు థియేటర్లలో సినిమానే లేదు. మొత్తం కలిపితే కనీసం కోటి రూపాయలు షేర్ కూడా వచ్చేలా కనిపించడం లేదు.

ఈ సినిమా బడ్జెట్, ప్రమోషన్ అంతా కలిపి కనీసం 18 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు నిర్మాతలు. క సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగా గ్రాస్ రావడంతో.. ఈ సినిమాకు అది హెల్ప్ అవుతుందని ముందు వెనక చూసుకోకుండా బాగానే ఖర్చు పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 కోట్లు ఖర్చుపెట్టిన సినిమాకు కనీసం 2 కోట్లు కూడా రాకపోవడం నిర్మాతలకు అతిపెద్ద షాక్. ఈ సినిమాతోనే ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరెగమ తెలుగులో ప్రొడక్షన్లోకి లాంచ్ అయింది. వచ్చి రావడంతోనే వాళ్లకు పెద్ద షాక్ తగిలింది. కిరణ్ అబ్బవరం ఇకమీద కూడా ఇలాంటి సినిమాలు చేస్తూ పోతే కెరీర్ కు శుభం కార్డు పడడానికి పెద్దగా టైం పట్టదు. ప్రస్తుతం కె ర్యాంప్ సినిమాతో బిజీగా ఉన్నాడు కిరణ్. దీని తర్వాత మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. కానీ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కచ్చితంగా జరిగే నష్టం మామూలుగా ఉండదు. ఏం చేసినా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి అంటున్నారు కిరణ్ సన్నిహితులు కూడా. హిట్టు కొట్టడం గొప్ప విషయం కాదు.. కొట్టిన తర్వాత మనం దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాం అనేది గొప్ప. ఆ విషయంలో నాని అందరికంటే ముందుంటాడు. ఒకానొక టైంలో మూడు నాలుగు ఫ్లాపులు వచ్చి కెరీర్ ఎండ్ అయిపోతుందేమో అనుకున్న టైంలో.. వరుసగా 8 హిట్లు కొట్టి ఎవరికి అందనంత ఎత్తుకు చేరిపోయాడు నాని. ఇప్పుడున్న కుర్ర హీరోలు అందరికీ నాని కెరీర్ నిదర్శనం. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో పాతుకు పోవాలంటే జస్ట్ నాని కెరీర్ ను ఫాలో అయితే సరిపోతుంది.