Kisi Ka Bhai Kisi Ki Jaan: కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ హిందీ సినిమానా? తెలుగు సినిమానా?

ఈ చిత్ర హిందీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా చూసినట్లే అనిపిస్తోంది. యాక్టర్స్‌ అందరూ హిందీలో మాట్లాడినా తెలుగు సినిమా అనే ఫీలింగే వస్తోంది. 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'లో సల్మాన్‌ఖాన్‌ను మినహాయిస్తే కీలక పాత్రల్లో కనిపించబోయే నటులు అందరూ మనవాళ్లే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2023 | 01:51 PMLast Updated on: Apr 11, 2023 | 1:51 PM

Kisi Ka Bhai Kisi Ki Jaan Is Hindi Movie Or Telugu Movie

Kisi Ka Bhai Kisi Ki Jaan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. విక్టరీ వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతి బాబు, భూమికా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర హిందీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా చూసినట్లే అనిపిస్తోంది.

యాక్టర్స్‌ అందరూ హిందీలో మాట్లాడినా తెలుగు సినిమా అనే ఫీలింగే వస్తోంది. ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లో సల్మాన్‌ఖాన్‌ను మినహాయిస్తే కీలక పాత్రల్లో కనిపించబోయే నటులు అందరూ మనవాళ్లే. స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్గే ఫస్ట్ టైం సల్మాన్‌తో జత కట్టింది. పూజా బ్రదర్‌గా విక్టరీ వెంకటేశ్‌ ముఖ్య పాత్రలో కనిపించాడు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు విలన్. వీళ్లకు తోడు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సాంగ్‌ను పెట్టడంతో కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ తెలుగు సినిమా అయిపోయింది.

‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ తమిళ హిట్‌ వీరమ్‌కు రీమేక్‌. ఇదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా ‘కాటమరాయుడు’గా తీశారు. కాటమరాయుడు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంగా రూపొందింది. కానీ, అన్నదమ్ముల అనుబంధానికి సంబంధించిన ఈ చిత్రం హిందీలోకి వెళ్లేసరికి సల్మాన్‌, పూజా లవ్‌స్టోరీగా మారిపోయింది. ట్రైలర్‌లో బ్రదర్స్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ లేకుండా కేవలం లవ్‌స్టోరీతో నడిపేశాడు దర్శకుడు. కిసీ కా భాయ్‌.. ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్ ముంబాయ్‌లో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి జగపతిబాబుతోపాటు పూజా హెగ్డే హాజరయ్యారు.

సైంధవ్‌ షూటింగ్‌లో ఉన్న కారణంగా వెంకటేశ్‌ కనపించలేదు. సల్మాన్‌ తనకు కలిసొచ్చిన ఈద్‌ సందర్భంగా ఈ నెల 21న ఈ మూవీతో థియేటర్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. పఠాన్‌, భోళాతో భారీ యాక్షన్‌ సీన్స్‌కు అలవాటుపడ్డ బాలీవుడ్‌ ఆడియన్స్‌ కోసం హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌తో వస్తున్నాడు సల్లూ భాయ్‌. తెలుగులోనూ విడుదలవ్వబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.