Ramcharan upasana : క్లీంకార, ఉపాసనతో గ్లోబల్ స్టార్ షికారు..
టాలీవుడ్ (Tollywood) క్యూట్ కపుల్ రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు.

Kleenkara, Upasana Global Star Shikaru..
టాలీవుడ్ (Tollywood) క్యూట్ కపుల్ రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా విశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. సాగరతీరంలో ప్రకతి అందాలను ఆస్వాదించాడు. తన కుటుంబంతో కలిసి బీచ్ కు వచ్చిన రామ్ చరణ్… సూర్యోదయాన్ని ఆస్వాదించాడు.
చెర్రీ తమ లిటిల్ ప్రిన్సెస్ క్లీంకారకు కూడా సముద్రపు అలలను పరిచయం చేశాడు. రామ్ చరణ్, ఉపాసన తమ పెంపుడు కుక్క పూడిల్స్ ను కూడా బీచ్ (Beach) వద్దకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ తన కూతురు తో కలిసి ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అంటూ ఫ్యాన్ మురిసిపోతున్నారు. బేబీ ని ఎత్తుకుని చిన్నపిల్లడిలా మారిపోయి నీళ్ళల్లో ఆడుకుంటున్న చెర్రీ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
విశాఖలోని స్థానిక మత్స్యకారులతోనూ రామ్ చరణ్ ఆప్యాయంగా మాట్లాడాడు. వారు పట్టుకొచ్చిన చేపలను ఆసక్తిగా పరిశీలించాడు. ఇక, షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రామ్ చరణ్ కు అభిమానుల నుంచి తాకిడి మామూలుగా లేదు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తారు. ఫ్యాన్స్ ను నియంత్రించడానికి చరణ్ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఫ్యాన్స్ తనపై కురిపించిన అభిమానానికి చెర్రీ సైతం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడట.