దేవర మూవీ మీద… కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఫైర్ ..?
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ ఈమధ్య తను రైట్స్ తీసుకున్న ఓ నవలని కాపీ కొట్టకండి అంటూ ఫైర్ అయ్యాడు. తన మాట వినకుండా కాపీ కొడితే, లీగల్ గా యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఇది కొత్త న్యూసేం కాదు. కాని కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, తను కొరటాల శివ ని టార్గెట్ చేసే ఈ కామెంట్ చేశాడనంటున్నారు.
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ ఈమధ్య తను రైట్స్ తీసుకున్న ఓ నవలని కాపీ కొట్టకండి అంటూ ఫైర్ అయ్యాడు. తన మాట వినకుండా కాపీ కొడితే, లీగల్ గా యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఇది కొత్త న్యూసేం కాదు. కాని కొత్త డెవలప్ మెంట్ ఏంటంటే, తను కొరటాల శివ ని టార్గెట్ చేసే ఈ కామెంట్ చేశాడనంటున్నారు. తను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో తీసిన దేవరలో చాలా సీన్లు శంకర్ కొన్న నవలనుంచే కాపీ కొట్టారని ప్రచారం జరుగుతోంది. అసలు ఆ నవలేంటి? అందులో ని సీన్లు నిజంగానే దేవర మూవీలో కొరటాల శివ కాపీ కొట్టాడా? మరి డైరెక్టర్ శంకర్ కోప్పడ్డది ఈ దర్శకుడినేనా?
దేవర ఈశుక్రవారమే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ మీద దండెత్తబోతున్నాడు. ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో ఒకే ఒక్క స్టేట్ మెంట్ వివాదంగా మారలేదా ఉంది. అది కూడా అల్లాటప్ప వ్యక్తి ఇచ్చింది కాదు. జెంటిల్మన్ నుంచి రోబో వరకు జమానాలోనే పాన్ ఇండియాను షేక్ చేసిన తమిళ దర్శక దిగ్గజం శంకర్ ఇచ్చాడు
తను వెంకటేషన్ అనే తమిళ నావెల్ రైటర్ దగ్గర నవ యుగ నాయగన్ వేల్ పారి నవల రైట్స్ తీసుకున్నాడట. అయితే అందులో చాలా సీన్లు, ఫైట్లు చాలా మంది కాపీ కొడుతున్నారని, అలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇది తనని చాలా డిసప్పాయింట్ చేసిందన్నాడు. ఈ నవలలో చాలా ముఖ్యమైన సీన్ అనుకున్న దాన్నే ఏకంగా దేవరలో వాడారని, తెలిసి, పరోక్షంగా కొరటాల శివకి లీగల్ గా అప్రోచ్ అవుతానంటూ వార్నింగ్ ఇచ్చాడట శంకర్.
ఇది పూర్తి గా నిజమని తేలకపోయినా, సోషల్ మీడియా ట్రెండ్ కాబట్టి, శంకర్ ఇచ్చిన వార్నింగ్ కొరటాల శివకే అంటున్నారు. సినిమాల్లో, సీరియన్స్ లేదంటే ఏ క్రియేటివ్ కంటెంట్ లో కాని ఆ నవలలోని సీన్లు కాపీ చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నాడు శంకర్. అది కూడా దేవర రెండో ట్రైలర్ రివీల్ అయిన వెంటనే ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు
అంతే సొరచేప మీద స్వారి, అలానే సముద్రంలో నిలబడుతూ తేలే ఎముకల గూడ్లు, చిన్న కంటైనర్లను మోస్తూ నీటిలోపల ముందుకెళ్లే సముద్ర దొంగలు లాంటిసీన్లు నవయుగ నాయగన్ వేల్ పారీ నవలనుంచి కొరటాల శివ కాపీ కొట్టాడని తమిళ తంబీలు ఆల్రెడీ కామెంట్లు దంచేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే దేవర నిజంగానే ఆ నవల లోని సీన్లకు కాపీనా లేదంటే, ఏదోచూసి ఇంకేదో ఊహించుకుని సోసల్ మీడియాలో కామెంట్లు పెండుతున్నారా అనేది శుక్రవారం తేలబోతోంది. శంకర్ మాటలకు అర్ధం ఏంటో కూడా అప్పుడే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.