Varalaxmi Sarathkumar : చిరు తో వరలక్ష్మి శరత్ కుమార్…!
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar).. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది.. దీనికి కారణం ఇటీవలి కాలంలో ఈమె నటించిన సినిమాలే. సాధారణంగా హీరోయిన్‌గా పరిచయం అయిన అమ్మాయిలు.. అవే తరహా సినిమాలు చేస్తుంటారు. కానీ వరలక్ష్మి మాత్రం యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతోంది.

Kollywood Powerful Villain Varalakshmi Sarath Kumar Movie with Tollywood Moga Star Chiranjeevi
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar).. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది.. దీనికి కారణం ఇటీవలి కాలంలో ఈమె నటించిన సినిమాలే. సాధారణంగా హీరోయిన్‌గా పరిచయం అయిన అమ్మాయిలు.. అవే తరహా సినిమాలు చేస్తుంటారు. కానీ వరలక్ష్మి మాత్రం యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతోంది. ప్పటికే తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. తెలుగులోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ నుంచి పవర్‌ఫుల్ విలన్‌గా మారిన ఈ సూపర్ టేలెంటెడ్ యాక్ర్టెస్ ఇప్పుడు మెగా స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇక.. ప్రస్తుతం ప్రభంజనం సృష్టిస్తున్న హనుమాన్ (Hanuman) సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ మళ్లీ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె నటనకు మంచి స్పందన వస్తోంది. హనుమాన్ సినిమా చూసిన వారంతా వరలక్ష్మి శరత్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో.. ఆమెకు వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ కి మరో భారీ ఆఫర్ దక్కిందని టాక్. మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీలో… వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాడ్‌ఫాదర్ మూవీలో కలిసి నటించిన ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వరలక్ష్మీ శరత్ కుమార్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే అత్యుత్తమ నటనతో ఆకట్టుకుంది. ఆమె కెరీర్‌లో ‘విక్రమ్ వేదా’, ‘విష్మయ’, ‘మానిక్యా’, ‘కసాబా’ వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. హీరోయిన్‌గా సక్సెస్ అయిన ఈ అమ్మాయి. ‘పందెం కోడి 2’, ‘సర్కార్’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి అదరగొట్టేసింది. దీంతో.. వరలక్ష్మి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పుడు మరోసారి చిరు క్రేజీ మూవీలో ఆఫర్ కొట్టేసింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..