Kanguva : వంద రోజుల్లో ‘కంగువ’
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమా మరో వంద రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ఇదే విషయాన్ని చెబుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్.

Kollywood star hero Surya's movie Kanguva is going to hit the theaters in next hundred days.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమా మరో వంద రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ఇదే విషయాన్ని చెబుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. దీంతో.. సూర్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.
సూర్య నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కంగువ’ పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య యుద్ధ వీరుడుగా నటిస్తున్నాడు. యుద్ధ వీరుడు అంటే సాదా సీదా వీరుడు కాదు.. అతి భయంకరమైన వీరుడుగా సూర్య లుక్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ఇప్పటికే కంగువ సిజిల్ పేరుతో రిలీజ్ అయిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కంగువ అద్భుతమైన విజువల్ వండర్‌గా రాబోతుందని టీజర్ చూస్తే చెప్పొచ్చు. ఖచ్చితంగా సూర్య కెరీర్ బెస్ట్ మూవీగా కంగువ నిలిచేలా ఉంది. సూర్యకు విలన్‌గా అనిమల్ అబ్రార్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరి పై వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. ఈ ఇద్దరిని బిగ్ స్క్రీన్ పై చూస్తే.. మెంటల్ మాస్ అనేలా ఉంది
ఈ సినిమాలో వార్ సీన్‌ను ఏకంగా 10 వేల మందితో తెరకెక్కించినట్టుగా చెబుతున్నారు. దీంతో అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. ఇక ఈ సినిమాను దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. దీంతో.. సరిగ్గా మరో 100 రోజుల్లో కింగ్ వస్తున్నాడని స్పెషల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. అలాగే.. దసరా కానుకగా 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంద అందిస్తున్నాడు. మరి కంగువ ఎలా ఉంటుందో చూడాలి