Vijay Dalapathy, Trisha’s wedding : దళపతివిజయ్ తో త్రిష పెళ్లి..!
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా.. నాలుగు పదుల వయసులోను త్రిష అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు కదా.. రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తోంది. త్రిష ముందు కుర్ర హీరోయిన్ కూడా దిగదుడుపే అనే రేంజ్‌లో ఉంది. పొన్నియన్ సెల్వన్ (Ponnian Selvan) సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది.

Kollywood star hero Vijay Dalapathy and star heroine Trisha's wedding
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా.. నాలుగు పదుల వయసులోను త్రిష అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు కదా.. రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తోంది. త్రిష ముందు కుర్ర హీరోయిన్ కూడా దిగదుడుపే అనే రేంజ్‌లో ఉంది. పొన్నియన్ సెల్వన్ (Ponnian Selvan) సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) ని సైతం డామినేట్ చేసింది త్రిష. అందుకే అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ మధ్యే కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ (Leo) సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం కొన్ని తమిళ్, మళయాళ ప్రాజెక్ట్స్ కూడా చేస్తోంది. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఇలా ఓ పక్క త్రిష కెరీర్ పీక్స్‌లో ఉండగా మరో వైపు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష (Trisha) ఎంగేజ్‌మెంట్ (Engagement) అయింది.. కానీ ఆ తరువాత క్యాన్సిల్ అయింది. ఎందుకో ఏమో తెలియదు కానీ.. పెళ్లి వరకు వెళ్లిన త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తలేదు. కానీ ఆ మధ్య ఓ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతోందనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ ఆ వార్తలను కొట్టిపారేసింది త్రిష. అయితే.. మళ్లీ ఇప్పుడు త్రిష పెళ్లి వార్తలు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా స్టార్ హీరోతో అనే వార్త వైరల్‌గా మారింది. కానీ ఈ న్యూస్ కూడా కొత్తేం కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో త్రిష పెళ్లి అనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి. కానీ తాజాగా ఓ ప్రముఖ ఫిలిం జర్నలిస్టు (Film journalist) ఓ ఇంటర్వ్యూలో త్రిష ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. విజయ్, త్రిష మధ్య రిలేషన్ ఉందని.. గతంలో త్రిష ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సమయంలో కోటిరూపాయల విలువైన డైమండ్ నెక్లెస్‌ను అధికారులు పట్టుకున్నారు. అది హీరో విజయ్ తనకు బహుమతిగా ఇచ్చాడని త్రిష చెప్పిందని.. సదరు జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు ఆ మధ్య విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు త్రిషతో ఏకంగా పెళ్లి అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అనేది తెలియదు గానీ.. ఇప్పటి వరకు త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి కారణం హీరో విజయ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.