చిరంజీవి,జూ.ఎన్టీఆర్ ని లేవకుండా దెబ్బేసిన కొరటాల..

నా పనిలో వేలు పెడితే అలాగే ఉంటుంది. నా పని నన్ను చేసుకుని ఇవ్వండి..... ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన వార్నింగ్. ఆచార్య అట్టర్ ప్లాప్ కి కారణం చిరంజీవేనని... మన పని తనను చేసుకొని ఇవ్వలేదని ఇన్ డైరెక్ట్ గా శివ చెప్పిన మాటలు ఇవి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 04:59 PMLast Updated on: Sep 28, 2024 | 4:59 PM

Koratala Biggest Shock To Ntr And Chiranjeevi

నా పనిలో వేలు పెడితే అలాగే ఉంటుంది. నా పని నన్ను చేసుకుని ఇవ్వండి….. ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన వార్నింగ్. ఆచార్య అట్టర్ ప్లాప్ కి కారణం చిరంజీవేనని… మన పని తనను చేసుకొని ఇవ్వలేదని ఇన్ డైరెక్ట్ గా శివ చెప్పిన మాటలు ఇవి. అందుకే దేవర లో కొరటాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు హీరో నిర్మాతలు.
ఎలా కావాలంటే అలా సినిమా తీయమన్నారు. అందుకే దేవరానీ కొరటాల శివ కంపు కంపు చేసి వదిలి పెట్టాడని గగ్గోలు పెడుతున్నారు ఫాన్స్.

టిల్లు స్క్వేర్‌ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేట్టు దేవర వుంటుందని చెప్పిన ఎన్టీఆర్‌ మాటలకు అర్థాలే వేరా? జనతాగ్యారేజ్‌ సూపర్‌హిట్‌ కావడంతో తారక్‌ కొరటాలను గుడ్డిగా నమ్మేశాడనిపిస్తోంది. దర్శకుడు ఆచార్యలో పాద ఘట్టం నుంచి దేవరలో సముద్ర మట్టానికి వచ్చేడేగానీ.. దేవరను కొత్తగా చూపించలేకపోయాడు. ఆచార్య డిజాస్టర్‌ తర్వాత కూడా తారక్‌ జాగ్రత్తపడకుండాపోవడంతో.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయలేకపోయారు.

‘సముద్రం మీద తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణిచేసే భయంగా దేవర కనిపిస్తాడు. కాన్సెప్ట్‌ వినడానికి బాగున్నా.. చూడడానికి ఏమాత్రం బాగోలేదు. కథలో మనసును కట్టడిచేసే ఎమోషన్‌ మిస్‌ అయింది. దేవర సినిమా చూడాలన్న ధైర్యాన్ని చంపేసే అంత భయం పుట్టించాడు దర్శకుడు. ఎర్ర సముద్రం.. ఆయుధపూజ.. భయం. ఈమూడు పదాలు నచ్చి కథను అల్లు కుంటే అది దేవర అవుతుందేగానీ.. అర్థవంతమైన కథ.. కథనం కరువయ్యాయి.
ఆచార్య డిజాస్టర్‌ నుంచి కొరటాల శివ ఏమాత్రం నేర్చుకోకుండా.. మరోసారి తప్పు చేశాడు. మూడు గంటల సినిమాలో అదిరిపోయే సీన్‌ అంటే ఒక్కటీ చెప్పలేం. దేవర తాగి డ్యాన్స్‌ వేసే సీన్‌ మాత్రమే ఆకట్టుకుందంటే.. అందులో సెంటిమెంట్‌.. ఎమోషన్‌ కాస్త కనిపించింది. ఈ కథను రెండు భాగాలుగా ఎందుకు తీయాలనుకున్నాడో తెలీదు. అంత స్పాన్‌ వున్న కథ కూడా కాదు. ఇక దేవర2 తీసే ధైర్యం చేయరు. అందరూ రెండు పార్టులు తీస్తున్నారు.. మనం ఎందుకు తీయకూడదన్న థాట్ నుంచి దేవర 1 వచ్చింది.

సినిమాలో హీరోయిన్‌ వుండాలి కాబట్టి జాన్వీని పెట్టారు. జాన్వీ వుంది కాబట్టి గ్లామర్‌గా చూపించారు. ఆమె పోషించిన తంగం రోల్‌ సినిమాకే కాదు.. జాన్వీ కెరీర్‌కూ ఏమాత్రం ఉపయోగపడదు. ఎన్టీఆర్‌, జాన్వీపై తీసిన ‘దావుడి’ సాంగ్‌ సినిమాలో పెట్టలేదు. సందర్భం లేకుండా తీసేసి.. లెంగ్త్‌ ఎక్కువైందని పక్కన పెట్టి కోట్లు ఖర్చు పెట్టించాడు దర్శకుడు. ఏదో ఒక సోషల్‌ రెస్పాన్స్‌తో సినిమాలు తీయడం కొరటాల స్పెషాలిటీ. మిర్చి.. శ్రీమంతుడు.. జనతాగ్యారేజ్‌.. భరత్‌ అనే నేను తీసి వరుస హిట్స్‌ కొట్టిన కొరటాల శివ దారి తప్పాడు. ఆచార్య…దేవరలో కొరటాల మార్క్‌ కనిపించలేదు. పాద ఘట్టం అంటూ ఆచార్యలో.. ఆయుధపూజ అంటూ ఆడియన్స్‌ను భయపెట్టేసాడు శివ.

దేవరగా ఎన్టీఆర్‌ యాక్టింగ్‌కు వంక పెట్టకపోయినా… కెరీర్‌కు ఉపయోగపడదు. అనిరుధ్‌ మ్యూజిక్‌ అంతంత మాత్రమే. సాధారణంగా హైట్‌ తక్కువ వున్న హీరోలను కెమెరామేన్‌ తన పనితనంతో ఎలివేట్‌ చేస్తారు. కానీ.. ఎన్టీఆర్‌ కటౌట్‌ను నార్మల్‌గా చూపించాడు రత్నవేలు. దేవర ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో మీరు ఏ విషయంలో భయ పడతారని కొరటాలను అడిగితే.. పక్కాడి పనిలో వేరు పెట్టేవాళ్లంటే భయమని చిరంజీవి పైనే సెటైర్ వేశాడు శివ. మరి దేవరలో ఎవరైనా వేలు పెట్టారా? ఎవరూ జోక్యం చేసుకోకుండానే.. ఇలాంటి సినిమా తీశాడా?ఏదైమైనా… ఆచార్య నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోయాడు కొరటాల.

దేవర కథ.. మేకింగ్‌ కంటే.. ప్రమోషన్‌.. బుకింగ్స్‌పై దృష్టి పెట్టి సక్సెస్‌ అయ్యారు. మొదటి రోజు థియేటర్స్‌ ఖాళీగా లేవు… టిక్కెట్లన్నీ బుక్‌ అయిపోయాయన్న టాక్‌ తీసుకురావడంలో కొరటాల ఫ్లాన్‌ వర్కవుట్‌ అయింది. ఒకేసారి వారం రోజుల టిక్కెట్లు ఓపెన్‌ చేస్తే.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు.. వీకెండ్‌ వెళ్దామని ప్రిపేర్‌ అవుతారు. దీంతో.. రిలీజ్‌ రోజు ఇంకా ఖాళీగా వున్నాయన్న ఫీలింగ్‌ వస్తే.. నెగిటివీ స్ప్రెడ్‌ అవుతుంది. దీంతో బుక్‌ మై షోలో రెండు రోజులపాటు రిలీజ్‌డే టిక్కెట్స్‌ తప్ప వీకెండ్‌ టిక్కెట్స్‌ కూడా ఓపెన్‌ చేయలేదు. దీంతో మొదటి రోజు రికార్డ్‌ స్థాయిలో 140 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టినా.. సినిమా హిట్‌ కావాలంటే.. వరల్డ్‌వైడ్‌ 180 కోట్లు కలెక్ట్ చేయాలి.
మొదటి ఐదు రోజులు కలిసి వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏదోరకంగా బయట పడిపోవచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తగిలిన దెబ్బ మాత్రం ఇప్పట్లో మందు. కొరటాల వేసిన బౌన్సర్కి ఇప్పటివరకు చిరంజీవి రామ్ చరణ్ మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ జూనియర్ ఎన్టీఆర్ కూడా తోడయ్యాడు.