KORATALA SHIVA: దర్శకులూ జాగ్రత్త.. కాపీ కొడితే.. కత్తిరిస్తారు..
కొరటాల శివ ఒక్కడే కాదు.. ఇలా కాపీ వివాదాల్లో చాలా మందే చిక్కుకున్నారు. టాలీవుడ్‌లో గురూజీగా ఫోకస్ అయిన త్రివిక్రమ్ మీద డజన్ల కొద్ది కాపీ వివాదాలున్నాయంటారు. గుంటూరు కారం మూవీ కూడా యద్దనపూడి సులోచనా రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల కాపీ అన్నారు.

KORATALA SHIVA: కొరటాల శివ హిట్ మూవీ శ్రీమంతుడు.. నిజానికి స్వాతి మ్యాగజైన్ నుంచి కాపీ కొట్టిన కథంటూ అప్పట్లో వేసిన కేసు, ఇప్పుడు పంచ్ ఇస్తోంది. సుప్రీం కోర్టుని ఆశ్రయించిన కొరటాల శివకి పంచ్ పడటంతో, టాలీవుడ్‌లో ఇక కథల కాపీ అంత ఈజీకాదని తేలిపోతోంది. గతంలో కూడా భరత్ అనే నేను మూవీ.. లీడర్ ప్రేరణ అన్నారు. కాని అది కూడా కాపీనే అన్న కామెంట్స్ వచ్చాయి. సర్కార్ హీందీ మూవీ కాపీనే జనతా గ్యారేజ్ అన్న కామెంట్స్‌కి కూడా బలం చేకూరుతోంది.
Janhvi Kapoor: డ్యాన్స్ ఇరగదీసిన జాన్వీ.. దేవరలో మామూలుగా ఉండదా..?
కొరటాల శివ ఒక్కడే కాదు.. ఇలా కాపీ వివాదాల్లో చాలా మందే చిక్కుకున్నారు. టాలీవుడ్‌లో గురూజీగా ఫోకస్ అయిన త్రివిక్రమ్ మీద డజన్ల కొద్ది కాపీ వివాదాలున్నాయంటారు. గుంటూరు కారం మూవీ కూడా యద్దనపూడి సులోచనా రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల కాపీ అన్నారు. మలయాళం మూవీ రాజ మాణిక్యం స్టోరీకి కాపీనే గుంటూరు కారం అనేశారు. ఇదేనా.. అల వైకుంఠపురంలో నిజానికి ఎన్టీఆర్ హిట్ మూవీ ఇంటిగుట్టుకి కాపీ అయితే, అరవింద సమేత వీరరాఘవలో మొండి కత్తి కూడా కాపీవివాదం ఫేస్ చేసింది. ఇక ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్‌ని మక్కీకి మక్కీ కాపీ కొట్టి, ఫ్రెంచ్ డైరెక్టర్ జెరెమ్ సల్లే ట్వీట్లకు సమాధానాలు చెప్పలేకపోయాడు త్రివిక్రమ్.
రాజమౌళి మూవీల్లో చాలా వరకు సీన్లు ఎత్తిపోతలే అన్న కామెంట్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే ఒకప్పటిలా చాలా మంది దర్శకులు మరొకరి కథలో, నవలలో, మరోభాషలో సినిమాలో చూసి, ఆ సీడీతో రూమ్‌లోకెళ్లి, స్క్రిప్ట్‌తో బయటికొస్తా అంటే కుదరదు. కాపీ రైట్స్ యాక్ట్ ఎంతగా స్ట్రాంగ్ అవుతుంతో, కొరటాల శివ ఇన్సిడెంట్‌తోనే తేలిపోతోంది.