Jahnvi Kapoor: జాన్వీ కపూర్‌ కల నెరవేర్చిన కొరటాల శివ

తనకు ఎన్టీఆర్‌ అంటే ఎంతో ఇష్టమని.. చాన్స్‌ వస్తే ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానంటూ జాన్వీ కపూర్‌ గతంలో చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఏకంగా తారక్‌ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుని తన కల నెరవేర్చుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2023 | 02:03 PMLast Updated on: Mar 06, 2023 | 2:03 PM

Koratala Siva Fulfilled Janhvi Kapoors Dream

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్‌ 30 సినిమాలో హీరోయిన్‌ను కన్‌ఫాం చేశారు మూవీ టీం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పక్కన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను ఫైనల్‌ చేసినట్టు ప్రకటించారు. జాన్వీ కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. సముద్రం ఒడ్డున జాన్వీ కపూర్‌ కూర్చున్న స్టిల్‌ను రిలీజ్‌ చేశారు. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా జాన్వీ ఉందంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ. ఎన్టీఆర్‌ 30లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించబోతోందంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఆ గాసిప్స్‌ను నిజం చేసింది మూవీ యూనిట్‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది జాన్వీ కపూర్‌. తనకు ఎన్టీఆర్‌ అంటే ఎంతో ఇష్టమని.. చాన్స్‌ వస్తే ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానంటూ జాన్వీ కపూర్‌ గతంలో చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఏకంగా తారక్‌ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుని తన కల నెరవేర్చుకుంది. దీంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానంటూ సోషల్‌ మీడియాలో ఆనందాన్ని పంచుకుంది. ఎన్టీఆర్‌తో షూటింగ్‌లో పాల్గొనేందుకు తానెంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. యాక్షన్‌ బ్యాగ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనికోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పని చేస్తున్నట్టు ఇప్పటికే నిర్మాతలు తెలిపారు. దీంతో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఆస్కార్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ కోసం ఎన్టీఆర్‌ అమెరికాకు వెళ్లాడు. తిరిగి ఇండియాకు రాగానే షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.