కొరటాల నోటి దూల, దేవర కొంప ముంచుతుందా…?

అసలే నెగటివ్ ప్రచారం దెబ్బకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది అంటే పిచ్చి పీక్స్ లో ఉండే స్టేజ్ నుంచి నెగటివ్ ప్రచారాన్ని కడుక్కోవడమే సరిపోతుంది రోజు రోజుకి. దానికి తోడు ట్రైలర్ కు వంద వంకలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 22, 2024 | 11:10 AMLast Updated on: Sep 22, 2024 | 11:10 AM

Koratala Siva Indirect Comments On Chiranjeevi

అసలే నెగటివ్ ప్రచారం దెబ్బకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుంది అంటే పిచ్చి పీక్స్ లో ఉండే స్టేజ్ నుంచి నెగటివ్ ప్రచారాన్ని కడుక్కోవడమే సరిపోతుంది రోజు రోజుకి. దానికి తోడు ట్రైలర్ కు వంద వంకలు. ఒకడు ఆ షాట్ కాపీ అంటాడు, ఇంకొకడు డైలాగ్ లు కాపీ అంటాడు, మరొకడు పాటలు కాపీ అంటాడు… ఏదేదో రాస్తున్నారు, చదువుతున్నారు, చెప్తున్నారు. ఎప్పుడు లేని చండాలం అంతా దేవరకు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.

సినిమాను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం పక్కా అనే వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆచార్య సినిమాను అందరూ ట్రోల్ చేయడం అక్కడ చిరంజీవి తప్పు అంటూ అందరూ మాట్లాడటం మైనస్ అయిపోయింది. ఇప్పుడు దేవర ప్రమోషన్స్ లో కొరటాల శివ నోటి దూల కూడా ఇబ్బంది పెడుతోంది. ఎన్టీఆర్, కొరటాల కలిసి విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ ఎవడి పని వాడు చేస్తే బాగుంటుంది, ఇంకొకడి పని ఇంకొకడు చేసి కెలికేస్తే బాగోదు అంటూ మాట్లాడారు.

ఇది డైరెక్ట్ గా చిరంజీవికి తగిలిన మాట వాస్తవం. గతంలో ఆచార్య సినిమాను చిరంజీవి డైరెక్ట్ చేసారని వార్తలు వచ్చాయి. చివరకు కొరటాల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఆ సినిమా. ఇప్పుడు ఆ కోపాన్ని దేవర ప్రమోషన్స్ లో చూపించాడు కొరటాల అని అంటున్నారు జనాలు. ఇప్పుడు ఇది మెగా ఫ్యాన్స్ కి ఇంకా మండుతుంది. అసలే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్న సమయంలో నోటి దూల అవసరమా అంటున్నారు జనాలు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక మెగా ఫ్యాన్స్ కొరటాల తో పాటుగా ఎన్టీఆర్ ను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.