Jr. NTR: ఫైటింగ్ ఆపేసిన ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్.. ఇక మిగతా షూటింగ్ షురూ..
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాలో ఇంపార్టెంట్ ఫైట్ సీన్ పూర్తైనట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Koratala Siva is directing the movie starring Junior NTR Saif Ali Khan and Hollywood choreographer Kenny Beats is doing the heavy action scenes in the movie.
సమద్రం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో భారీ ఫైట్ సీన్లు ఉంటాయని కొరటాల ముందుగానే చెప్పేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య ఉండే యాక్షన్ సీన్స్ అత్యంత భీకరంగా ఉంటాయని చెప్పారు. ఆ ఫైట్స్ కంపోజ్ చేసేందుకు హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బీట్స్, విజువల్ ఎఫెక్ట్ స్పెషలిస్ట్ బ్రాడ్ మిన్నిచ్‌ను పిలిపించారు. వాళ్లిద్దరి సారధ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌ను మూవీ యూనిట్‌ను పూర్తి చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఎప్పుడూ చూడనంత వైలెంట్‌గా చూడబోతున్నారంటూ కొరటాల ముందే హింట్ ఇచ్చాడు. ఆ హింట్‌కు తగ్గట్టుగానే ఫైట్ సీన్స్ ప్లాన్ చేశాడు. సముద్రంలో ఓ భారీ షిప్‌లో ఫైట్ సీన్స్ ప్లాన్ చేస్తున్న ఫొటోలు రీసెంట్‌గా వైరల్ అయ్యాయి. ఆ తరువాత బ్లడ్ ట్యాంకర్ తెప్పించి మరోసారి ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశాడు కొరటాల. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ సినిమా మీద అమాంతం ఆశలు పెంచుకున్నారు. నార్మల్‌గానే దేవర సినిమా మీద ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి.
ట్రిపులార్ సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఓ రేంజ్‌లో హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కొరటాల ఇస్తున్న అప్‌డేట్స్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. మరి ఇంత వైలెంట్‌గా వస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.