బన్నీతో ఓకే పవన్ తో సినిమా తీయను, కొరటాల సంచలన కామెంట్స్
తనపై మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో పగబట్టినా కొరటాల శివ మాత్రం సైలెంట్ గా హిట్ కొట్టి చూపించారు. దేవర సినిమాపై ముందు నుంచి మెగా ఫ్యాన్స్ కక్షతోనే వ్యవహరించారు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది.
తనపై మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో పగబట్టినా కొరటాల శివ మాత్రం సైలెంట్ గా హిట్ కొట్టి చూపించారు. దేవర సినిమాపై ముందు నుంచి మెగా ఫ్యాన్స్ కక్షతోనే వ్యవహరించారు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. అందుకే పాటలు, లుక్స్, ట్రైలర్ ఇలా ఏది బయటకు వచ్చినా సరే టార్గెట్ చేసి మరీ విమర్శలు చేసారు. ఇక సినిమా విడుదల తర్వాత అయితే పక్కాగా సినిమా ఫ్లాప్ అనే కామెంట్స్ చేసారు జనాలు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దేవర సినిమాను అన్ని రూపాల్లో టార్గెట్ చేసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు.
ముఖ్యంగా ఇదంతా కొరటాల మీదున్న కోపమే అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు కొరటాల మళ్ళీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. దేవర సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఆచార్య కొట్టిన దెబ్బ నుంచి గట్టి కం బ్యాక్ ఇచ్చాడు కొరటాల. ఈ తరుణంలో కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు ఈ స్టార్ డైరెక్టర్. కొరటాల మాట్లాడుతూ అల్లు అర్జున్‌తో కచ్చితంగా మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసాడు. కొంతమంది బన్నీ సినిమాలు క్యాన్సిల్ చేసి అదే కథతో దేవర తీసామని అనుకుంటున్నారని… అందులో ఎలాంటి నిజం లేదు అని స్పష్టం చేసేసాడు.
అల్లు అర్జున్ స్టోరీ వేరే ఉందన్నాడు. మాకు ఆలస్యం కారణంగా సినిమా క్యాన్సిల్ అయిందని… కచ్చితంగా ఆ సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమా చేశారు.. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా… పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని నాకు ఎప్పటినుంచో ఉందని… కానీ.. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి… ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, దానికి తోడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఇక ఆయన తర్వాతి సినిమాల్లో నటిస్తారో లేదో తెలియదు, పవన్ తో సినిమా అంటే కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు కొరటాల. దీనితో మెగా ఫ్యామిలీకి కొరటాల దూరం పాటిస్తున్నారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి.