కొరియన్ బాలయ్య.. డాన్ లీ ఎంట్రీ ఎప్పుడయ్యా…?
కొరియన్ బాలయ్య అనగానే, కొరియాలో నటసింహం సినిమాలు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ రావొచ్చు. కాని కొరియాలో ఇంత వరకు బాలకృష్ణ సినిమాలేవి రిలీజ్ కాలేదు. కాని ఇకమీదట రిలీజ్ అయ్యేలా ఉన్నాయి.

కొరియన్ బాలయ్య అనగానే, కొరియాలో నటసింహం సినిమాలు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ రావొచ్చు. కాని కొరియాలో ఇంత వరకు బాలకృష్ణ సినిమాలేవి రిలీజ్ కాలేదు. కాని ఇకమీదట రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. అఖండ 2 తో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన బాలయ్య, అండ్ టీం కొరియామీద కాన్ సన్ ట్రేట్ చేయటానికి, ఇప్పటి వరకు రీజన్ లేదు. కాని తన పేరు మాత్రం అక్కడ మనవాల్లు పాపులర్ చేస్తున్నారు. దానికి కారణం స్పిరిట్ మూవీనే. ఇందులో విలన్ గా కొరియన్ స్టార్ డాన్ లీ కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచార జరుగుతోంది. అయితే తననే ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది కొరియన్ బాలయ్య అంటున్నారు. తను కూడా ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్లే ఎక్కువగా చేయటం వల్ల… తనని కొరియన్ బాలయ్యగా తెలుగు జనం పాపులర్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కొరియన్స్ కి బాలయ్యని ఇలా పరోక్షంగా ఇంట్రడ్యూస్ చేసినట్టౌతోంది. ఏదేమైనా ఇక్కడ మాత్రం డాన్ లీ చాలా ఈజీగా తెలుగు మాస్ జనాలకు దగ్గరయ్యేందుకు దారి దొరికింది. డాన్ లీ అంటే ఎవరో కూడా తెలియన తెలుగు జనాలు, తన మీద గూగుల్ సెర్చ్ చేసేందుకు బాలయ్య పేరు ఉపయోగపడుతోందట…
నటసింహం బాలయ్య, రెబల్ స్టార్ ప్రభాస్, కొరియన్ స్టార్ డాన్ లీ ఈ ముగ్గురి పేర్లతో గూగుల్ సెర్చ్ లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఎవరు పెట్టారో, ఆ పేరు కాని కొరియన్ బాలయ్య అన్న పదంతో గూగుల్ లో సెర్చ్ భారీగా జరుగుతోందట. దాని ఫలితంగా కొరియాలో కూడా బాలయ్య మీద డిస్కర్షన్ జరిగే పరిస్థితి వచ్చింది..దానికి దబిడి దిబిడి సాంగ్ కూడా తోడైంది. మొన్న జపన్ లేడీస్ ఢాకూ మహారాజ్ మూవీ పాట దబిడి దిబిడి కి డాన్స్ చేసి పెట్టిన వీడియో వైరలైంది. ఆ వీడియో కి తోడు, ప్రభాస్, డాన్ లీ మీద ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ సాయంతో చేసిన ఓ వీడియో కూడా తోడైంది. వీటితోనే కొరియాలో నటిసింహం బాలయ్య పేరు సౌండ్ చేస్తోందట.
బాలకృష్ణ సినిమాలేవి జపాన్ లోనో, కొరియాలోనో రిలీజ్ కాలేదు. కొరియన్ స్టార్లెవరి మూవీలు తెలుగులో పాపులర్ కాదు. అయినా కొరియన్ స్టార్ డాన్ లీని కొరియన్ బాలయ్య అనటం వల్లే, ఇప్పుడు ఆ పేరు సోషల్ మీడియాలో వైరలైంది.డాన్ లీని కొరియన్ బాలయ్య అని తెలుగు వాళ్లే సంభోదించటం మొదలుపెట్టారు. దానికి కారణం డాన్ లీ కొరియాలో చేసే సినిమాలు ఎక్కువగా మాస్ యాక్షన్ డ్రామాలే అవటం.. 90శాతం ఊర మాస్ యాక్షన్ డ్రామాలతో అక్కడి మాస్ ని ఎంటర్ టైన్ చేస్తాడు. దీంతో పాటు తన సినిమాల్లో ఫైట్ సీన్లు ఓవర్ ద టాప్ అనిపించేలా ఉంటాయి.
అందుకే తనని ముద్దుగా కొరియన్ బాలయ్య అని పిలుస్తున్నారు తెలుగు ఆడియన్స్. అయితే తననే ఇలా అంతా తలుచుకోవటానికి కారణం, ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోయే స్పిరిట్ లో తానే విలన్… రెబల్ స్టార్ తో ఈ కొరియన్ స్టార్ విలన్ గా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని, తెలిసినప్పటి నుంచి తన మీద గూగుల్ సెర్చ్ పెరిగింది. అప్పటి నుంచే తనని కొరియన్ బాలయ్య అని పిలుస్తు ఉండటంతో, ఇప్పుడు కొరియాలో కొత్త సెర్చ్ మొదలైంది. వాట్ ఈజ్ కొరియన్ బాలయ్య అన్న పాయింట్ తో అక్కడ సెర్చ్ లు చేస్తున్నారట.ఇలాంటి టైంలోనే జపాన్ లేడీస్ దబిడి దిబిడి సాంగ్ కి డాన్స్ వేసిన వీడియో కొరియాలో వైరలవ్వటం, అలా బాలయ్య సినిమా మీద అక్కడ చర్చ మొదలవ్వటం హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి టైంలో అక్కడి వాళ్లకి నచ్చేలా బాలయ్య మూవీ ఏదైనా కొరియాలో రిలీజైతే, రీచ్ కూడా ఉండొచ్చనంటున్నారు. ఏదేమైనా ఎవరి ప్రమేయం లేకుండానే ఇక్కడి బాలయ్య పేరు కొరియాలో, కొరియా స్టార్ డాన్ లీ పేరు ఇండియాలో మారుమోగుతోంది.