Anushka Shetty: లెక్క మారింది.. పవన్ ఔట్.. అనుష్క ఇన్
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. డైరెక్టర్ క్రిష్‌తో అనుష్క ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లుకి బ్రేక్ పడి చాలా రోజులే అవుతోంది. అసలు ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళ్తుందనే గ్యారెంటీ లేదు.

Anushka Shetty: ఈ మధ్య బయట కూడా ఎక్కడ కనిపించడం లేదు అనుష్క. తాజాగా అనుష్క ఓ హోటల్‌లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ అనుష్క ప్రజెంట్ ఏం చేస్తుంది.. ఎలాంటి సినిమాలు చేయబోతోందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ.. ‘కథనార్’ అనే మలయాళం సినిమా చేయబోతున్నానని చెప్పుకొచ్చింది.
EAGLE REVIEW: ఈగల్ రివ్యూ.. యాక్షన్ ఫీస్ట్.. రవితేజ ఊచకోత నెక్ట్స్ లెవల్
అలాగే ‘తెలుగులో ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్నాను.. ‘బెంగళూరు నాగరత్నమ్మ’ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నటిగా ఇంకా చాలా ప్రయోగాలు చేయాలనుంద’ని చెప్పింది అనుష్క. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అనుష్క. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. డైరెక్టర్ క్రిష్‌తో అనుష్క ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లుకి బ్రేక్ పడి చాలా రోజులే అవుతోంది. అసలు ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళ్తుందనే గ్యారెంటీ లేదు. అయితే తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా దర్శకుడి బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. హరిహర వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు నిర్మాత ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ తీసుకోబోతున్నట్లు సమాచారం.
దీంతో అనుష్కతో క్రిష్ ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారట. గతంలో వేదం సినిమా కోసం కలిసి పని చేశారు క్రిష్, అనుష్క. ఆ సినిమాలో సరోజ పాత్రలో అదరగొట్టింది అనుష్క. ఇక ఇప్పుడు క్రిష్‌తో కొత్త ప్రాజెక్ట్ చేస్తోందని అంటున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.