Krithi Shetty: తగ్గాల్సి వచ్చింది.. కృతి శెట్టి అంతలా తగ్గించిందా..?
ప్రస్తుతం కృతి చేతిలో మూడు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘మనమే’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో కృతి శెట్టి మరిన్ని టాలీవుడ్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Is Bebamma's horoscope rising again in the south.. What is the reason for the increase in offers like Krithi Shetty who has not had any success for a year?
Krithi Shetty: టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో.. కృతి శెట్టి కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతిని కాపాడలేకపోయాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి.. అదే స్పీడ్‌లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. దీంతో కృతి శెట్టికి ఆఫర్లు అరకొరగానే వస్తున్నాయి.
BJP Election Manifesto Release : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్..
ప్రస్తుతం కృతి చేతిలో మూడు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘మనమే’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో కృతి శెట్టి మరిన్ని టాలీవుడ్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో.. రెమ్యునరేషన్ తగ్గించడానికి కూడా రెడీగా ఉందట. ఎంతలా అంటే.. సగానికి సగం ఇచ్చిన సరే.. ఓకె అనేలా ఉందట. ఫస్ట్ సినిమాకు 50 లక్షల లోపే రెమ్యునరేషన్ అందుకున్న కృతి.. ఉప్పెన హిట్‌తో కోటి దాకా అందుకుంది. ఆ తర్వాత కూడా బాగానే పారితోషికం అందుకుంది. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్‌ది ఏముందిలే.. మంచి ఛాన్స్ ఇస్తే చాలనే ఆలోచనలో ఉందట.
అంతేకాదు.. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా సై అంటోందట. అయితే.. కృతికి ఆఫర్లు రావాలంటే.. అది శర్వానంద్ ‘మనమే’ సినిమాపై ఆధారపడి ఉంటుంది. అది హిట్ అయితే టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం పక్కా. మరి పారితోషికం తగ్గించుకున్న కృతికి.. ఇప్పటికైనా ఛాన్స్‌లు వస్తాయేమో చూడాలి.