Kriti Sanon: కృతి సనన్ – ప్రభాస్ ప్రేమ అంతా డ్రామానేనా..?

బేడియా వరుస ఇంటర్వ్యూస్‌లో బోర్‌ ఫీలైన వరుణ్‌ ఏదైనా పుకారు సృష్టిద్దామనుకున్నాడు. కృతి జీవితంలో ఓ స్పెషల్‌ పర్సన్‌ వున్నాడని చెబుతానన్నాడు. దీనికి కృతి కూడా సరే అంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 05:08 PMLast Updated on: Mar 09, 2023 | 6:47 PM

Kriti Sanon Reveals About Relationship With Prabhas

కృతిసనన్‌… ప్రభాస్ లవ్‌స్టోరీని కావాలనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మార్చేశారు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ వుందో లేదోగానీ.. కథనాలు సృష్టించారు. అలాగని ఇదంతా మీడియా చేసిన పని కాదు. ప్రభాస్‌, కృతిసనన్‌ కావాలనే లవ్‌స్టోరీ నడిపారు. లవర్స్‌ కాని ఈ లవర్స్‌ ఎంత పని చేశారో చూద్దాం.
ప్రభాస్‌, కృతిసనన్‌ కలిసి ‘ఆదిపురుష్‌’లో రాముడు, సీతగా నటించారు. షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందో లేదోగానీ… మీడియాలో మాత్రం త్వరలో ఏడడుగులు వేసే జంటని చేసేశారు. ఇలా పుకార్లు చెలరేగిపోతుంటే… కృతిసనన్‌, వరుణ్‌ధావన్‌ ఇద్దరు దీనికి ఆజ్యం పోశారు. దీంతో ప్రభాస్‌.. కృతి ప్రేమలో కూరుకుపోయాడని… ఇన్నాళ్లకు పెళ్లి కొడుకు అవుతున్నాడంటూ… రకరకాల కథనాలు చక్కర్లు కొట్టాయి. వరుణ్‌ లేపిన వాంటెడ్ గాసిప్ కి ప్రభాస్‌ పెళ్లికొడుకు అయిపోయాడు.
కృతిసనన్‌, వరున్‌ ధావన్‌ జత కట్టిన సినిమా ‘బేడియా’ ప్రమోషన్‌లో వరుణ్‌ ఫన్నీగా అన్న కామెంట్‌ కృతి, ప్రభాస్‌ను లవర్స్‌గా మార్చేశాయి. బేడియా వరుస ఇంటర్వ్యూస్‌లో బోర్‌ ఫీలైన వరుణ్‌ ఏదైనా పుకారు సృష్టిద్దామనుకున్నాడు. కృతి జీవితంలో ఓ స్పెషల్‌ పర్సన్‌ వున్నాడని చెబుతానన్నాడు. దీనికి కృతి కూడా సరే అంది. ఆ స్పెషల్‌ పర్సన్‌ ప్రభాసే అంటూ సోషల్‌ మీడియాలో ఈ వార్త గిర్రున తిరిగేసింది.
వరుణ్‌ సృష్టించిన ఆ స్పెషల్‌ పర్సన్‌ ప్రభాస్‌ కూడా షాక్‌ అయ్యాడు.. వరుణ్‌ ఎందుకిలా అన్నాడని ప్రభాస్‌ స్వయంగా కృతికి ఫోన్ చేసి అడిగాడట. వరుణ్‌ మంచి ఫ్రెండేగానీ.. పిచ్చోడని ఏదేదో మాట్లాడేశాడని ప్రభాస్‌కు వివరణ ఇచ్చుకుంది కృతిసనన్‌. వరుణ్‌ పనితో ప్రభాస్‌, కృతి పెళ్లి చేసుకుంటున్నారనుకుని నమ్మేసి విషెస్‌ తెలుపుతూ.. చాలా మెసేజెస్ వచ్చాయట. అందుకే వెంటనే స్పందించి.. అది వట్టి పుకారేనని.. ఇందులో నిజం లేదని చెప్పాల్సి వచ్చిందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కృతిసనన్‌.
బేడియో ప్రమోషన్‌ కోసం ఏదో ఒక పుకార్ు సృష్టిద్దామనుకుంటే… ఏదేదో జరిగింది. చివరికి ప్రభాస్‌తో ఎఫైర్‌ లేదని… ఓన్లీ ఫ్రెండ్‌ అని కృతి చెప్పాల్సి వచ్చింది. అన్‌స్టాపబుల్‌ షోకు వెళ్లిన ప్రభాస్‌ని బాలయ్య కృతితో ప్రేమ అంట కదా అని ఆడుకున్నాడు. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన రెండు ఎపిసోడ్స్‌లోనూ లవ్‌ గోలే. ఏమీ లేదని మేడమ్‌ చెప్పారు కదా? అని ప్రభాస్‌ అనడం మళ్లీ డౌట్‌ క్రియేట్‌ చేసింది. కృతిని మేడమ్‌ మేడమ్‌ అని గౌరవంగా పిలుస్తాడు? ప్రేమలో వున్నాడంటూ మరోసారి పుకార్లు మొదలయ్యాయి. ప్రభాస్‌, కృతి మధ్య ఏది లేదని.. జస్ట్‌ ఫన్‌ కోసమే అని హోస్ట్‌ చెప్పడంతో ఇదంతా… ఎగ్జయిట్‌మెంట్ కోసం ఆడిన నాటకంగా తేలిపోయింది.
బేడియా ప్రమోషన్‌లో పుకారు క్రియేట్‌ చేద్దామని వరుణ్ అడగడం.. కృతి ఓకె అనడంతో రచ్చ మొదలై నిశ్చితార్థం దాకా వెళ్లింది. ఇక అన్‌స్టాపబుల్‌ షోలో కావాలనే నాటకం ఆడి చివర్లో తూచ్‌.. అంతా ఉత్తుత్తినే అంటూ ఎండ్‌ కార్డ్‌ వేశారు. బాలీవుడ్‌లో ఎఫైర్‌ ఉన్నా లేకపోయినా.. మీడియాలో కథనాలు పుట్టుకొస్తాయి. కానీ.. ప్రభాస్‌, వరుణ్ ధావన్, కృతిసననే గాసిప్స్‌ పుట్టించి అందరూ లేని తమ లవ్‌స్టోరీ గురించే మాట్లాడుకునే చేశారు.