Nandamuri Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో కేటీఆర్..? షూటింగ్ ఎప్పుడు..?

మూడో సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి గెస్టుగా వస్తే మరోసారి రికార్డులు బద్దలవడం ఖాయం. చిరంజీవి తర్వాత మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2023 | 08:27 PMLast Updated on: Sep 19, 2023 | 8:27 PM

Ktr Is The Next Guest For Balakrishnas Unstoppable Show

Nandamuri Balakrishna: తెలుగు ఓటీటీపై సక్సెస్‌ఫుల్ షో ఏదీ అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్. ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పెద్ద సినిమాల రిలీజ్ రోజు ఎంత హడావిడి ఉంటుందో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ప్రసారమయ్యే రోజు కూడా అంతే హడావిడి కనిపిస్తుంది. షూటింగ్, గెస్టులు, స్ట్రీమింగ్ డేట్ వంటి వాటి కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తారు. ఈ షో హిట్ అయ్యేందుకు బాలయ్య హోస్టింగ్ స్టైల్ ఒక కారణమైతే.. ఈ షోలో పాల్గొనే గెస్టులు మరో కారణం.

టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఈ షోలో సందడి చేశారు. దీంతో సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఓటీటీలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడీ సీజన్‌కు కొనసాగింపుగా మూడో సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆహా, అన్‌స్టాపబుల్ టీం పర్యవేక్షిస్తోంది. ఈ షోలో ప్రధానంగా నిలిచే అంశం.. ఇందులో పాల్గొనే గెస్ట్స్! మూడో సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి గెస్టుగా వస్తే మరోసారి రికార్డులు బద్దలవడం ఖాయం. చిరంజీవి తర్వాత మరో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా కొందరు పొలిటీషియన్లు ఈ షోలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఈ షోలో పాల్గొంటే దీనికి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. సాధారణంగా మీడియాకు అందుబాటులో ఉంటూ.. అనేక విషయాల్లో తన అభిప్రాయాలు చెబుతుంటారు. అయితే, అన్‌స్టాపబుల్ షో కాస్త భిన్నంగా ఉంటుంది. కాబట్టి, ఈ షోకు మరింత ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది. సినిమా, రాజకీయ, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలుంటాయి. కేటీఆర్ ఈ షోకు రావడం ఖాయమైతే బాలయ్యతో కలిపి చూడొచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వెసలుబాటును బట్టి షూటింగ్ జరిగే ఛాన్స్ ఉంది.