KUMARI AUNTY: బిగ్‌బాస్ ఎంట్రీ! బిగ్‌బాస్‌లోకి కుమారి ఆంటీ!

సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 07:10 PMLast Updated on: Jan 31, 2024 | 7:10 PM

Kumari Aunty Will Contest In Star Maas Bigg Boss Telugu

KUMARI AUNTY: కుమారి ఆంటీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మారుమోగుతున్న పేరు. రెండు ఎక్స్‌ట్రా లివర్లు.. వెయ్యి రూపాయలు.. ఈ ఒక్క మాట.. ఆంటీని సోషల్‌ మీడియా స్టార్‌ను చేసేసింది. అదే సమయంలో ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినేందుకు.. కిలోమీటర్లకు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చేవాళ్లు కుర్రాళ్లు! దీంతో ఫుడ్ స్టాల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ కనిపించడం.. పోలీసులు కేసు నమోదు చేయడం.. సోషల్‌ మీడియా మోతెక్కి పోవడం.. ఆ తర్వాత.. సీఎం స్వయంగా రియాక్ట్ కావడం.. కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌కు లైన్ క్లియర్ కావడం చకచకా జరిగిపోయాయ్.

HANUMAN: హనుమాన్ దర్శకుడికి 100 కోట్ల బంపర్ ఆఫర్..

ఇలా సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే బిగ్‌బాస్ షోలోకి కుమారి ఆంటీ ఎంట్రీ అంటూ.. సోషల్‌మీడియా వేదికగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత అనే సంగతి పక్కనపెడితే.. బిగ్‌బాస్‌ ప్రతీ సీజన్‌లో సామాన్యులకు అవకాశం దక్కుతుంది. లాస్ట్ సీజన్‌లో సామాన్యుడిగా ఎంటర్ అయి.. పల్లవి ప్రశాంత్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. ఐతే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన కుమారి ఆంటీ.. రాబోయే రోజుల్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే చర్చ జరుగుతోంది.

ఐతే బిగ్‌బాస్ షో ఏంటో కూడా.. కుమారి ఆంటీకి తెలియకపోవడం హైలైట్‌. బిగ్‌బాస్ షో అంటే.. వంటలు చేయాలా అని అమాయకంగా ఆన్సర్ ఇస్తుంటుంది ఆంటీ. ఐతే ఫుడ్‌ బిజినెస్‌ ద్వారా రోజుకు 10వేల రూపాయలు మిగులుతాయని.. .ఆ డబ్బులలో కొంత మొత్తం వర్కర్స్‌కు ఇచ్చిన తర్వాత తనకు 5వేల రూపాయలు మిగులుతాయని కుమారి ఆంటీ చెప్తున్నారు. ఏమైనా కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ చుట్టూ జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం రేవంత్ జోక్యంతో మొత్తమ్మీద విషయం క్లియర్ అయింది. ఐతే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే.. కుమారి ఆంటీ బిగ్‌బాస్‌కు పోతుందా లేదా అని అంతే !